పుట:Hello Doctor Final Book.pdf/427

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాలము తిరోగమనము చెందుతే అన్నవాహికలో తాపము (inflammation), ఒరపిడులు (erosions), వ్రణములు (ulcers) కలుగగలవు. ఆమ్ల తిరోగమనమునకు కారణములు :

కడుపులోని పదార్థములు  అన్ననాళము లోనికి చాలా కారణముల వలన తిరోగమించగలవు. రంధ్ర గళనము ( Hiatal hernia ) :

అన్ననాళ రంధ్రము ( Oesophageal hiatus ) ద్వారా జఠరపు మీది భాగము ఛాతిలోనికి జాఱుట వలన ఆమ్లము అన్నవాహిక లోనికి తిరోగమించ గలదు. కొందఱిలో జఠరపు పైభాగము అన్ననాళముతో మీదకు (sliding hernia) భ్రంశము చెందితే, కొద్దిమందిలో అన్ననాళమునకు ప్రక్కగా మీదకు భ్రంశము (para esophageal  hernia ) చెందుతుంది.

అన్ననాళపు క్రింది నియంత్రణ కండరపు బిగుతు అనుచితముగా తగ్గుట వలన కొందఱిలో ఆమ్లతిరోగమనము జరుగుతుంది. బరువు ఎక్కువయిన వారిలోను, గర్భిణీస్త్రీలలోను, పొగత్రాగేవారిలోను ఆమ్ల తిరోగమనము కలిగే అవకాశములు హెచ్చు. స్క్లీరోడెర్మా ( Scleroderma ) వ్యాధిగ్రస్థులలోను, అన్నవాహిక

426 ::