పుట:Hello Doctor Final Book.pdf/426

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పోతాయి. శ్లేష్మపుపొర క్రింద వదులుగా సంధాన కణజాలము (alveolar tissue) ఉంటుంది. శ్లేష్మపుపొర, సంధాన కణజాలముల మధ్య నిలువునా కండరతంతులు ఉండి శ్లేష్మకండరము (muscularis mucosa) ఏర్పరుస్తాయి. శ్లేష్మపుపొర క్రింద అన్ననాళ గ్రంథులు ఉంటాయి. ఈ గ్రంథుల నాళికలు అన్ననాళము లోనికి తెఱుచుకొని శ్లేష్మస్రావకములను (mucous secretions) విడుదల చేస్తాయి. ఈ స్రావకములు మృదు క్షారగుణము కలిగి ఉంటాయి. జఠరము నుంచి తిరోగమనము అయే ఆమ్లమును తటస్థీకరించుటకు ఇవి తోడ్పడుతాయి. అన్నవాహిక గోడలో బయట నిలువు పోగులతో ఒక కండరము (longitudinal muscle), దానికి లోపల గుండ్రని పోగులతో మరొక కండరము (circular muscle) ఉంటాయి. ఈ కండరముల చలనము (peristalsis) వలన ఆహారము ముందుకు నెట్టబడుతుంది. అన్ననాళము పై భాగములోను, క్రింది భాగములోను నియంత్రణ కండరములు (sphincters) ఉంటాయి. గొంతులోని పదార్థములను మ్రింగునపుడు పై నియంత్రణ కండరము బిగుతు తగ్గి పదార్థములను అన్ననాళము లోనికి ప్రవేశింప జేస్తుంది. ఆ పదార్థములు కండర చలనముతో (peristalsis) క్రిందకు చేరాక, క్రింది నియంత్రణ కండరపు బిగుతు తగ్గి  పదార్థములు జఠరములోనికి ప్రవేశించుటకు అనుకూలిస్తుంది.

అన్ననాళము క్రింది నియంత్రణ కండరపు బిగుతు వలన, ఉదరవితానము అన్ననాళమును నొక్కి ఉంచుట వలన, అన్ననాళము జఠరముల మధ్య కోణము లఘుకోణము (acute angle) అగుట వలన జఠరములోని పదార్థములు అన్ననాళము లోనికి సాధారణముగా ప్రవేశించవు. ఆమ్లపదార్థములు అన్ననాళము లోనికి ఎప్పుడైనా ప్రవేశిస్తే క్షారగుణము కల అన్ననాళ స్రావములు, నోటి నుంచి వచ్చే లాలాజలము ఆ ఆమ్లమును తటస్థీకరింపజేస్తాయి. అన్ననాళ కండరముల సంకోచ వికాసములతో ఆ పదార్థములు తిరిగి కడుపు లోనికి నెట్టబడుతాయి. జఠరములో స్రవించు  ఉదజ హరికామ్లము జఠర రసమునకు ఆమ్ల గుణము ఇస్తుంది.  ఈ ఆమ్లము అన్నవాహిక లోనికి తఱచు, ఎక్కువ

425 ::