పుట:Hello Doctor Final Book.pdf/424

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లోపలకు  తీసుకోకూడదు. ఇవి ఔషధములు కాదు. వీటిని ఇంటి అరుగులు, వస్తువుల ఉపతలములు, పరికరములను శుద్ధి చేయుటకు వాడుతారు. సూక్ష్మజీవ సంహారక రసాయనములు ( Antiseptics ):

ఇవి చర్మమునకు, దెబ్బలకు, పుళ్ళకు పూయబడే సూక్ష్మజీవ సంహారక రసాయన పదార్థములు. వీటిని శరీరములోనికి తీసుకోకూడదు. సూక్ష్మజీవ నాశకములు ( Antibiotics ):

ఇవి శరీరములోనికి నోటిద్వారా, కండరములద్వారా, సిరలద్వారా తీసుకొనే సూక్ష్మజీవులను నశింపచేయు  ఔషధములు. విషజీవాంశ నాశకములు :

విషజీవాంశ నాశకములు (Antivirals ) : ఇవి   విషజీవాంశముల (viruses)  వృద్ధిని అరికట్టు ఔషధములు. వీటిని చర్మముపైన కాని, శరీరములోపలకు కాని వాడుతారు.

చాలా సమాజములలో వారి వారి సంస్కృతులు, అలవాటులు తరతరాలుగా జీర్ణించుకొని ఉంటాయి. ఏ సంస్కృతి పరిపూర్ణము, దోషరహితము కాదు. సకల సంస్కృతులను గౌరవిస్తూనే ఆరోగ్యానికి భంగకరమైన అలవాటులను మనము విసర్జించాలి. వైద్యులు, శాస్త్రజ్ఞులు, విద్వాంసులు అందులకు కృషి చెయ్యాలి.

423 ::