పుట:Hello Doctor Final Book.pdf/423

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కరచాలనములు :

కరచాలనముల వలన చాలా అంటురోగములు వ్యాప్తిచెందుతాయి. ఆరోగ్యరంగములో పనిచేసేవారు కరచాలనములు చేయకూడదు. ఇతరులు కూడా కరచాలనముల అలవాటును వదల్చుకోవాలి. పరులతో ఒకరినొకరు తాకకుండా ఆదరాభిమానములు చూపించుకొనుట ఉత్తమము. ఎంగిలి :

ఆహార పానీయములు సేవించే టప్పుడు ఎవరి పాత్రలు వారికే ఉండాలి. ఒకరువాడే పలుదోము కుంచెలు క్షురకత్తెరలు, దువ్వెనలు,  తువ్వాళ్ళు వేరొకరు వాడకూడదు. ఆహార పానీయముల శుభ్రత:

జీర్ణాశయము, ప్రేవులలో సూక్ష్మజీవులు కలిగించే కలరా, టైఫాయిడ్, అతిసారము, వంటి అంటురోగములను సమాజములో ప్రజలు అందఱికీ పరిశుద్ధమైన మరుగుదొడ్లను అందుబాటులో చేసి మలమును వ్యాధిజనక రహితముగా మలచుట వలన, నిర్మూలించే అవకాశము కలదు. పశ్చిమ దేశాలలో వాడే మరుగుదొడ్ల తొట్టెలను శుభ్రముగా ఉంచుట తేలిక. ప్రజలకు పరిశుభ్రమైన మరుగుదొడ్లు ఉంటే నీరు, ఆహారపదార్థాలు కలుషితమవవు.

మనము తినే ఆహారపదార్థాలు, త్రాగే పానీయములు శుచిగా ఉండాలి. ఆహారపదార్థాలపై ఈగలు, క్రిములు చేరకుండా జాగ్రత్తపడాలి. అంటురోగములను నివారించుటకు, చికిత్సచేయుటకు చాలా రసాయన పదార్థములను వాడుతాము. ఇవి : రోగజనక విధ్వంసకములు (disinfectants) :

ఇవి  వస్తువులపై ఉన్న సూక్ష్మజీవులను (bacteria), శిలీంధ్రములను (fungi), విషజీవాంశములను (viruses) ధ్వంసము చేసే రసాయన పదార్థములు. వీటిలో కొన్ని మృదుపదార్థములను (alcohol, hydrogen peroxide, dettol, betadine) చేతులు, చర్మమును శుభ్రము చేసుకొందుకు వాడినా, పుళ్ళ పైన వాడకూడదు, దేహము

422 ::