పుట:Hello Doctor Final Book.pdf/421

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గొట్టాలను (stethoscopes) కూడా ఆల్కహాలుతో శుభ్రము చేసుకొనుట మేలు.

Clostridium difficile వ్యాధిగ్రస్థులను పరీక్షించాక చేతులను సబ్బు, నీళ్ళతోనే శుభ్రము చేసుకోవాలి. ఈ సూక్ష్మజీవులు పెద్దప్రేవులలో తాపము కలిగించి అతిసారము కలిగిస్తాయి. వీటి బీజములు (spores) ఆల్కహాలు వలన నశింపవు.

రోగి శరీర ద్రవములు (రక్తము, చీము, లాలాజలము, శ్లేష్మము వగైరా) అంటుకొనే అవకాశములు ఉన్నపుడు చేతొడుగులు (gloves) తప్పక ధరించాలి. శరీర ద్రవములు (body fluids) దుస్తులపై చిమ్మే అవకాశము ఉన్నపుడు దుస్తులపై నిలువుటంగీలను (gowns) ధరించాలి.  రోగి శరీర ద్రవములు కళ్ళలో చిందే అవకాశము ఉన్నపుడు కళ్ళ రక్షణకు అద్దాలను (safety goggles) కాని పారదర్శక కవచాలను (transparent shields) కాని ధరించాలి. రోగులపై శస్త్రచికిత్సలు, శరీరము లోనికి సూదులు, ఇతర పరికరములు చొప్పించే  పరీక్షలు, ప్రక్రియలు (invasive procedures) సలిపేటప్పుడు కూడా వ్యాధిజనక రహిత (sterile) నిలువుటంగీలు, చేదొడుగులు, నోటి - ముక్కు కప్పులు ధరించాలి.

రోగులపై వాడిన సూదులు, పరికరములు, వారి దెబ్బలకు, పుళ్ళకు కట్టిన కట్టులు, వాడిన చేదొడుగులు నిలువుటంగీలను సక్రమముగా ఇతరులకు హాని కలుగకుండా విసర్జించాలి. తిరిగి వాడే పరికరములను రోగజనక రహితములుగా (sterilize) చెయ్యాలి. ఏకాంత వాసము ( isolation ) :

సులభముగా ఇతరులకు సంక్రమించు అంటురోగములు కలవారిని, ప్రమాదకరమైన అంటురోగములు కలవారిని ఏకాంత వాసములో (isolation) ఉంచాలి. వీరిని సందర్శించువారు నిలువుటంగీలు, నోటి - ముక్కు కప్పులు, చేదొడుగులు ధరించి వారి గదులనుంచి బయటకు వచ్చాక

420 ::