పుట:Hello Doctor Final Book.pdf/420

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సేవలు అందించు వైద్యులు, వైద్యసిబ్బంది గాలిని 95% వడకట్టు N-95 ఆచ్ఛాదనములను (N-95% masks) ధరించాలి.

కళ్ళకు రక్షణ చేకూర్చు కంటద్దాలు (safety goggles) ధరించాలి. చేతులకు చేదొడుగులు (gloves) ధరించాలి. దుస్తులపై శస్త్రచికిత్సకుల నిలువుటంగీలు (surgical gowns) ధరించాలి.

వ్యాధిగ్రస్థులకు సేవలు అందించి వారి గదులనుంచి బయటకు వచ్చాక వాటిని జాగ్రత్తగా తొలగించుకోవాలి. చేదొడుగులు ధరించినా చేతులు సబ్బు నీళ్ళతో శుభ్రము చేసుకోవాలి. పాదరక్షలను కూడా రోగజనక విధ్వంసకములతో (disinfectants) శుభ్రము చేసుకోవాలి. కొన్నిసూక్ష్మజీవులు, విషజీవాంశముల పరిమాణము 5 మైక్రోమీటర్లు కంటె తక్కువ ఉండుట వలన అవి గాలిలో చాలా గంటల సేపు తేలియాడుతు ఉండగలవు. వేపపువ్వు / తట్టు (measles), ఆటాలమ్మ (chickenpox) వ్యాధులు కలిగించే విషజీవాంశములు ఈ కోవకు చెందినవి. గాలి ద్వారా ఈ వ్యాధులు వ్యాపించగలవు. వ్యాధినిరోధకశక్తి లోపించినవారు, శరీర రక్షణవ్యవస్థ లోపములు కలవారు, గర్భిణీస్త్రీలు ఈ రోగుల పరిసరములలో చొరకూడదు. వైద్యశాలలలో ఉన్న ఈ రోగులను ఋణ వాయుపీడనము కల (negative air pressure) ప్రత్యేకపు ఒంటరి గదులలో ఉంచాలి. వీరిని సందర్శించువారు నోరు, ముక్కులను కప్పే  N- 95 ఆచ్ఛాదనములు (masks కప్పులు) ధరించాలి. వ్యాధిగ్రస్థులు వారి గదులనుంచి బయటకు రావలసిన అవసరము కలిగితే వారు శస్త్రచికిత్సకుల ఆచ్ఛాదనములు (surgical masks) ధరించాలి. సాధారణ జాగ్రత్తలు :

వైద్యులు, వైద్యసిబ్బంది రోగులను పరీక్షించేముందు, పరీక్షించిన పిదప చేతులను శుద్ధిపదార్థాలతో (sanitizers) రోగికి, రోగికి మధ్య  శుభ్రము చేసుకోవాలి. వైద్యులు, నర్సులు వారు వాడే వినికిడి

419 ::