పుట:Hello Doctor Final Book.pdf/418

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కలుషిత పానీయములు, లేక కలుషిత వాయువు ద్వారా శరీరములోనికి చొచ్చుకొని వ్యాధులకు కారణమవుతాయి. మనుజులనుంచి మనుజులకు కూడా సూక్ష్మజీవులు వ్యాపించగలవు. విషజీవాంశములు (Viruses) :

విషజీవాంశములు (viruses) జీవకణములలో వృద్ధిచెంది విసర్జింపబడే జన్యుపదార్థములు. ఇవి రైబోన్యూక్లియక్ ఆమ్లమును (Ribo Nucleic Acid)  కాని డీఆక్సీరైబో న్యూక్లియక్ ఆమ్లమును (Deoxyribo Nucleic Acid) కాని కలిగిఉంటాయి. బయట మాంసకృత్తు ఆచ్ఛాదనను (capsid) కలిగిఉంటాయి. కొన్ని కొవ్వు ఆచ్ఛాదనను కలిగిఉంటాయి. వీటికి జీవము లేకపోయినా యితర జీవకణముల లోనికి చేరినపుడు ఆ కణములలో వృద్ధి పొందుతాయి. జీవులలో ఇవి వ్యాధులను కలుగజేయగలవు. ఈ విషజీవాంశములకు యితర జీవవ్యాపార క్రియలు ఉండవు. పరాన్నభుక్తు లు (Parasites):

ఇవి ఇతర జీవులలో జీవించే జీవులు. ఇవి ఏకకణ జీవులు (ఉదా

మలేరియా పరాన్నభుక్తు) కాని, బహుకణ జీవులు కాని కావచ్చును.

ఇవి వాటి జీవనమునకు, వృద్ధికి ఇతర జీవులపై ఆధారపడుతాయి. పేలు, నల్లులు వంటి పరాన్నభుక్తులు శరీరము బయట ఉన్నా మనుజులనుండి మనుజులకు వ్యాపించగలవు. గజ్జి క్రిములు (Sarcoptes scabiei) కూడా మనుజులు ఒకరికొకరు సన్నిహితముగా ఉండుట వలన వ్యాపిస్తాయి. శిలీంధ్రములు (fungi):   

ఇవి  వృక్షజాతులకు జంతుజాలమునకు విభిన్నమైన జీవరాశులు. ఆహారమునకు ఇతర జీవులపై ఆధారపడుతాయి. వీని కణ కవచములు ఖైటిన్ అను బహుళ శర్కరను కలిగిఉంటాయి. ఇవి మృతకణములపై జీవిస్తాయి. అంటురోగములను కలిగించే వ్యాధిజనకములు (pathogens) వ్యాధిగ్రస్థుల నుంచి ఇతరులకు ప్రాకి వారికి కూడా వ్యాధులు కలిగిస్తాయి.

417 ::