పుట:Hello Doctor Final Book.pdf/414

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2) 3)

కెరటిన్, యితర శిధిలములు గోటి క్రింద చేరి, గోరు దిగువ చర్మము నుంచి ఊడిపోవచ్చును (Onycholysis).

నఖమూలములో వ్యాధి కనిపించవచ్చును. వ్యాధినిరోధకశక్తి తగ్గినవారిలో నఖమూలములలో వ్యాధి ఎక్కువగా కలుగుతుంది.

కొందఱిలో తెల్లని సుద్ద వంటి పొట్టు గోటి క్రింద కనిపిస్తుంది.

చాలామందిలో నొప్పి, బాధ ఉండవు, కాని కొందఱిలో చర్మములో కణతాపము ( cellulitis ) కలిగే అవకాశము కలదు. వ్యాధి నిర్ణయము :

అనుభవజ్ఞులైన వైద్యులు చూసి వ్యాధిని పసిగట్టగలరు.కత్తిరించిన గోళ్ళను, గోటి క్రింద భాగములను గోకి వాటిని పొటాసియమ్ హైడ్రాక్సైడ్ తో శిలీంధ్రములకై సూక్ష్మదర్శిని క్రింద పరీక్షించవచ్చును. కత్తిరించిన గోళ్ళను, గోళ్ళ క్రింద చర్మమును గోకి ఆ భాగములతో శిలీంధ్రములను ప్రయోగశాలలో పెంచి (fungal cultures) వ్యాధిని నిర్ణయించవచ్చును. వాటితో పొలిమెరేజ్ గుణకారచర్య (polymerase chain reaction  PCR) పరీక్షతో శిలీంధ్రములను త్వరగా గుర్తించవచ్చును. కత్తిరించిన గోళ్ళను, నఖ శిధిలములను  పెర్ ఐయోడిక్ ఏసిడ్ స్కిఫ్ (Periodic acid schiff) వర్ణకముతో సూక్ష్మదర్శినితో పరీక్షించి శిలీంధ్ర వ్యాధిని నిర్ణయించవచ్చును. సోరియాసిస్ (psoriasis) నఖవ్యాధి, లైఖెన్ ప్లానస్ (lichen planus) నఖవ్యాధి, యితర నఖవ్యాధులు శిలీంధ్రవ్యాధులను పోలి ఉండవచ్చు. కాబట్టి తగిన పరీక్షలతో చికిత్సకు పూర్వము  వ్యాధిని నిర్ణయించవలసిన అవసరము కలదు. చికిత్స :

గోటితామరలు అన్నిటికీ చికిత్స అవసరము లేదు. వ్యాధి తీవ్రత లేనప్పుడు, రోగికి బాధ లేనప్పుడు, యితర ఉపద్రవములు కలుగనప్పుడు, చికిత్స అవసరము లేదు.  చికిత్స వలన అందఱికీ సత్ఫలితములు కనిపించవు. ఫలితములు చేకూరినా, వ్యాధి మఱల వచ్చే అవకాశములు ఎక్కువ.

413 ::