పుట:Hello Doctor Final Book.pdf/415

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

టెర్బినఫిన్ (terbinafine), కీటోకొనజోల్ (ketoconazole) వంటి మందులు దీర్ఘకాలము వాడినపుడు కాలేయపరీక్షలు, రక్త పరీక్షలు చేస్తూ అవాంఛిత ఫలితములు రాకుండా జాగ్రత్త పడాలి. అందువలన వృద్ధులైన నా రోగులలో బాధపెట్టని నఖ శిలీంధ్రవ్యాధుల చికిత్స విషయములో (గోటితో పోయే దానికి. పోయేది గోరే కదా ? కాలేయమును సురక్షితముగా ఉంచుదాము  అనుకుంటూ) రోగులు కూడా నాతో అంగీకరించినపుడు నేను  చాలా సంయమనము పాటిస్తాను. కాని కణతాపము (cellulitis ) కలిగినవారిలోను, మధుమేహవ్యాధి (diabetes) కలిగి కణతాపము వంటి ఉపద్రవములు కలిగే అవకాశము ఉన్నవారిలోను, ఇతర బాధలు ఉన్నవారిలోను, రోగులు చికిత్స కావాలని కోరినపుడు చికిత్సలు అవసరము. గోళ్ళకు 8 %  సైక్లోపిరాక్స్ (ciclopirox) కాని, 10 % ఎఫినకొనజోల్ (efinaconazole) కాని, 5 % ఎమొరోల్ఫిన్ (amorolfine) కాని, పూతగా పూయుట వలన 30 శాతము మందిలో ఫలితములు కనిపిస్తాయి.

టెర్బినఫిన్ నోటిద్వారా దినమునకు 250 మి. గ్రాములు చొప్పున చేతిగోళ్ళకు 6 వారములు, కాలిగోళ్ళకు 12 వారములు కాని, లేక నెలలో దినమునకు 250 మి. గ్రాములు చొప్పున ఒక వారము మాత్రము ఇస్తూ విరామచికిత్సను (pulse therapy) ఫలితములు కనిపించే వరకు కొనసాగిస్తే 70 - 80 శాతము మందిలో ఫలితములు కనిపిస్తాయి. ఇట్రాకొనజోల్ (Itraconazole) దినమునకు 200 మి.గ్రాములు రెండుసారులు చొప్పున నెలలో ఒక వారము చొప్పున మూడు నెలలు చికిత్స చేస్తే 40-50 శాతముమందిలో ఫలితములు కనిపిస్తాయి. ఫలితములు కలిగినా 10 నుంచి 40 శాతము మందిలో వ్యాధి తిరిగి రావచ్చును. రోగులు గోళ్ళను పొట్టిగా కత్తిరించుకోవాలి. వారు పాత పాదరక్షలు మరల వాడకూడదు. చెమట పీల్చే కాలి తొడుగులు వాడుకోవాలి.  పాదములకు గాలి బాగా సోకనీయాలి. చేతులు పొడిగా

414 ::