పుట:Hello Doctor Final Book.pdf/413

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వృద్ధులలోను, పురుషులలోను, అదివరకు సోరియాసిస్ (psoriasis) వంటి గోటి వ్యాధులు కలవారిలోను, దూరధమని వ్యాధిగ్రస్థులలోను (peripheral arterial disease), మధుమేహవ్యాధిగ్రస్థులలోను, పాదములలో తామర కలవారిలోను, వ్యాధినిరోధకశక్తి లోపించినవారిలోను గోటి తామర తఱచుగా చూస్తాము.

ట్రైఖోఫైటాన్ రూబ్రమ్ (Trichophyton rubrum) వంటి చర్మాంకురములు (dermatophytes) 60-75 శాతపు గోటి తామరలను కలుగజేస్తాయి. ఏస్పర్జిల్లస్ (Aspergillus), స్కోప్యులారియోప్సిస్ (Scopulariopsis), ఫ్యుసేరియమ్ (Fusarium) వంటి శిలీంధ్రములు, మధుశిలీంధ్రములు (Candidiasis) వలన యితర నఖ శిలీంధ్రవ్యాధులు కలుగుతాయి. వ్యాధి లక్షణములు :

నఖములు శిలీంధ్రవ్యాధికి లోనగునపుడు వాటిపై తెల్లని, లేక పసుపు పచ్చని, లేక నల్లనిమచ్చలు పొడచూపుతాయి. ఆ గోళ్ళు దళసరికట్టి వికారము అవుతాయి. గోళ్ళు పెళుసుకట్టి సులభముగా విఱిగిపోతుంటాయి. గోళ్ళ తామర మూడు విధములుగా కనిపించవచ్చును. 1)

గోటి చివర వ్యాధి కనిపించి గోరు దళసరికట్టి, వివర్ణతచెంది,

412 ::