పుట:Hello Doctor Final Book.pdf/405

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శిరస్సుపై శిలీంధ్ర వ్యాధులను చర్మాంకురములు (Dermatophytes) కలిగిస్తాయి. Trichophyton tonsurans, Microsporum canis, Microsporum audouinii, Trichophyton schoenleinii, Trichophyton violaceum జాతుల శిలీంధ్రములు ఈ వ్యాధులను కలిగిస్తాయి. ఇవి పిల్లలలో తఱచు కలుగుతాయి. ఒకరి నుంచి వేఱొకరికి అంటువ్యాధులుగా సంక్రమిస్తాయి. వ్యాధి కలిగినవారిలో తలపై పొలుసులతో గుండ్రని మచ్చలు కాని, చుండు మచ్చలు (dandruff) కాని, లేక గుండ్రని బట్టతల మచ్చలు (alopecia) కాని అగుపిస్తాయి. బట్టతల మచ్చలు కలవారిలో కేశములు తల మట్టములో కాని, తలకు కొంచెము ఎగువగా కాని తెగిపోయి నల్లని బట్టతల మచ్చలు కాని, నెరసిన బట్టతల మచ్చలు కాని కలిగిస్తాయి. కొందఱిలో చిన్న చిన్న పుళ్ళు కలుగుతాయి. కొందఱిలో పుళ్ళు పుట్టి తాపప్రక్రియ వలన మెత్తని కాయలు ‘రోమకూప శిలీంధ్ర వ్రణములు ( Kerions ) ‘ ఏర్పడుతాయి. ఈ కాయలపై

404 ::