పుట:Hello Doctor Final Book.pdf/406

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చీముపొక్కులు, పెచ్చులు ఉండుట వలన  వైద్యులు కూడా  వాటిని చూసి చీముతిత్తులుగా (abscesses) భ్రమించవచ్చును. చీము తొలగించుట వలన, సూక్ష్మజీవ సంహారకముల (antibiotics) వలన  యివి నయము కావు. వ్యాధి నిర్ణయము :

అనుభవజ్ఞులయిన వైద్యులు తలపై పొడచూపు శిలీంధ్రవ్యాధులను చూసి నిర్ధారించగలరు. ఆ ప్ర్రాంతములో వెండ్రుకలు పెఱికి గాని, పొలుసులను, పెచ్చులను గ్రహించి గాని, వాటికి పొటాసియమ్ హైడ్రాక్సైడు చుక్కలు కలిపి సూక్ష్మదర్శిని క్రింద చూసి శిలీంధ్రముల పోగులను (hyphae), శిలీంధ్రబీజములను (spores) గుర్తుపెట్టి వ్యాధులను నిర్ణయించవచ్చు. వెండ్రుకలు, పొలుసులు, పెచ్చులు గ్రహించి ప్రయోగశాలలలో శిలీంధ్రములను పెంచి (fungal cultures) వ్యాధులను నిర్ణయించవచ్చును. అతి నీలలోహిత దీపకాంతిని (ultraviolet rays from Wood’s lamp) ప్రసరించినపుడు Microsporum canis, Microsprum audouinii ల వలన కలిగే మచ్చలు నీలాకుపచ్చ రంగులను ప్రతిదీప్తిస్తాయి. చికిత్స :

శీర్ష శిలీంధ్ర చర్మవ్యాధులకు శిలీంధ్రనాశక ఔషధములు (antifungals) నోటి ద్వారా వాడవలసి ఉంటుంది. పిల్లలలో గ్రైసియోఫల్విన్ (Griseofulvin) కాని, టెర్బినఫిన్ (terbinafine) కాని వాడుతారు. మందులు వ్యాధి పూర్తిగా నయమయే వఱకు సుమారు 4- 6 వారములు వాడవలసి ఉంటుంది. పెద్దలలో టెర్బినఫిన్ కాని, ఇట్రాకొనజాల్ (Itraconazole) కాని వాడుతారు. తలపై సైక్లోపిరాక్స్ (ciclopirox) లేపనము గాని, సెలీనియమ్ సల్ఫైడు (Selenium sulphide) కాని పూతగా పూసి వ్యాధి వ్యాప్తిని నిరోధించగలము.

తాపము (inflammation) అధికమయి పుళ్ళతో కాయలు

405 ::