పుట:Hello Doctor Final Book.pdf/404

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వ్యాధి తీవ్రత ఎక్కువయిన వారిలోను పదే పదే వ్యాధి కలిగేవారిలోను  నోటి ద్వారా ఇట్రాకొనజోల్ ( itraconazole ) దినమునకు 200 మి.గ్రా లు చొప్పున నెల దినములు లేక, టెర్బినఫెన్ (Terbinafine) దినమునకు 250 మి.గ్రాలు చొప్పున నెలనుంచి ఆరు వారములు వాడుతారు.

పాదములలోను పాదరక్షలలోను తేమ లేకుండాను, గాలి ప్రసరణ బాగున్నట్లు చూసుకోవాలి. బూట్ల కంటె చెప్పులు ధరించుట మంచిది. స్నానము తరువాత అరికాళ్ళను, వేళ్ళమధ్యను పొడి తువ్వాళ్ళతో  వత్తుకోవాలి . శిరస్సు శిలీంధ్ర వ్యాధి ; తల తామర ( Tinea capitis ) :

403 ::