పుట:Hello Doctor Final Book.pdf/403

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పాదములలో తామర సోకినపుడు వ్యాధి నాలుగు విధములుగా కనిపించ వచ్చును. 1)

2)

3)

4)

అరికాళ్ళలో చర్మము దళసరికట్టి, పొలుసులుకట్టి వ్యాధి అరికాళ్ళలో ముందు వ్యాపించి ఆపై పాదముల ప్రక్కలకు, మీదకు కూడా వ్యాపించ వచ్చును. Trichophyton rubrum తఱచు యీ వ్యాధికి కారణము. అంగుళాంతర వ్యాధి (Intertriginous tinea pedis ): ఈ వ్యాధిలో తేమ వలన పాదములో వేళ్ళమధ్య  ఒరుపులు కలిగి తెల్లని పొరలుగా చర్మము చిట్లుతుంది. ఎఱ్ఱదనము కూడా పొడచూపుతుంది.

వేళ్ళమధ్య ఒరుపులతో పుళ్ళు కలిగి ( ulcerative tinea pedis ) తాపము చర్మపు క్రింద కణజాలమునకు ( cellulitis), రసినాళములకు ( lymphangitis ) వ్యాపించవచ్చును. T. mentagrophytes var. interdigitale ఇట్టి తీవ్రవ్యాధిని కలిగిస్తుంది.    కొందఱిలో చిన్న చిన్న పొక్కులు ఏర్పడి అవి బొబ్బలు కడుతాయి ( vesiculobullous tinea pedis ). వాతావరణపు ఉష్ణము, తేమ ఎక్కువగా ఉన్నపుడు ఇరుకైన పాదరక్షలు ధరించే వారిలో ఈ బొబ్బలు కలుగుతాయి.

వైద్యులు  పాదములను పరీక్షించి వ్యాధినిర్ణయము చేయగలుగుతారు. అవసరమయితే చర్మపు పై పొరలను గోకి వచ్చిన పొట్టును పొటాసియమ్ హైడ్రాక్సైడు చుక్కలతో సూక్ష్మదర్శిని క్రింద పరీక్షించి శిలీంధ్రపు పోగులను (hyphae), బీజములను ( spores) గుర్తించి వ్యాధిని నిర్ణయించవచ్చును. చికిత్స :

శిలీంధ్రవ్యాధులను అరికట్టు లేపనములను పూతగా వాడుతారు. వేళ్ళమధ్య తేమ ఉన్నపుడు మికొనొజాల్ ( miconazole) పొడిని వాడవచ్చును. తేమను తగ్గించుటకు 5% అల్యూమినియమ్ సబ్ ఎసిటేట్ లేక 20% అల్యూమినియమ్ క్లోరైడు ద్రావకములను పూతగా పూయవచ్చును.        

402 ::