పుట:Hello Doctor Final Book.pdf/402

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

phyton mentagrophytes, Microsporum canis లు ఈ వ్యాధిని కలిగిస్తాయి.

మచ్చలు, పలకల లక్షణములబట్టి వ్యాధినిర్ణయము చేయవచ్చును. చర్మమును గోకి వచ్చిన పొట్టును పొటాసియమ్ హైడ్రాక్సైడు చుక్కలతో గాజుపలకపై సన్నని పొరగా నెఱపి సూక్షదర్శినితో పరీక్షించి శిలీంధ్రపు పోగులను (hyphae) గుర్తించవచ్చును. చికిత్స :

సైక్లోపిరాక్స్ ( Ciclopirox ) లేపనమును కాని, టెర్బినఫిన్ (Terbinafine ) లేపనమును కాని రోజుకు రెండుసారులు పూసి మర్దించి, రెండు లేక మూడువారములు వాడి ఫలితములు పొందవచ్చును. వ్యాధి విస్తారముగా ఉన్నపుడు, లేపనములకు లొంగనపుడు, నోటిద్వారా ఇట్రాకొనజాల్ ( Itraconazole ) దినమునకు 200 మి.గ్రాలు లేక టెర్బినఫిన్ ( Terbinafine ) రోజుకు 300 మి.గ్రాలు 3 నుంచి 6 వారములు వాడవలసి ఉంటుంది.                              పాద శిలీంధ్ర వ్యాధి ( Tinea Pedis ) :

401 ::