పుట:Hello Doctor Final Book.pdf/401

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

clopirox) లేపనములలో దేనినైనా దినమునకు రెండుసారులు పూచి మర్దనా చేస్తూ రెండు మూడువారములు వాడితే ఫలితము చేకూరుతుంది

దీర్ఘకాలము వ్యాధి ఉన్నవారిలోను, వ్యాధి విస్తారముగా ఉన్నవారిలోను, పూతల చికిత్సకు లొంగనివారిలోను ఇట్రాకొనజాల్ ( Itraconazole ) రోజుకు 200 మి.గ్రాలు గాని టెర్బినఫిన్ ( Terbinafine ) దినమునకు 250 మి.గ్రాలు గాని నోటి ద్వారా 3 నుంచి 6 వారములు వాడితే ఫలితములు కనిపిస్తాయి. నోటిద్వారా మందులు వాడేటప్పుడు తఱచు (మూడు నాలుగు వారములకు ఒకసారి) రక్తకణముల పరీక్షలు, కాలేయ వ్యాపార పరీక్షలు చేయాలి. ఒంటి తామర ( Tinea carporis ) :

ఒంటితామర దేహములో ముఖము, ఛాతి, వెన్ను, బొజ్జ, కాళ్ళు, చేతులలో పొడచూపవచ్చును. ఇది ఎఱుపు, లేక గులాబిరంగులో గుండ్రని పొలుసుల మచ్చలుగా గాని, పలకలుగా గాని కనిపిస్తుంది. ఈ మచ్చల అంచులలో చిన్న పొక్కులు ఉండవచ్చును. ఇవి మధ్యలో మానుతూ అంచులలో వ్యాప్తి చెందుతాయి. Trichophyton rubrum, Tricho:: 400 ::