పుట:Hello Doctor Final Book.pdf/400

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దీనివలన దురద కలుగుతుంది. తామర వర్తుల ఆకారములో తామ్రవర్ణపు మచ్చలుగ తొడమూలములో  లోపలిభాగములో పొడచూపుతాయి. ఇవి అంచులలో వ్యాప్తి చెందుతూ, మధ్యభాగములో నయము అవుతూ కనిపిస్తాయి. మచ్చలలో గఱుకుదనము కనిపిస్తుంది. ఒరిపిడి, చెమట ఎక్కువయి నానుడుతనము ఉండవచ్చును. దీర్ఘకాలము వ్యాధి ఉన్నవారిలో మచ్చలు గట్టిపడి తోలువలె దళసరికట్టవచ్చును.

అనుభవజ్ఞులైన వైద్యులు చూసి వ్యాధిని నిర్ణయించగలరు.  గాజు పలకతో గాని, శస్త్రకారుని చురకత్తి అంచుతో గాని జాగ్రత్తగా మచ్చల అంచులను గోకి వచ్చిన పొట్టును గాజుపలకపై  పొరగా నెఱపి పొటాసియమ్ హైడ్రాక్సైడు చుక్కలు వేసి పది పదిహైను నిమిషముల తరువాత సూక్ష్మదర్శిని క్రింద పరీక్షించి గడలు వలె ఉండి శాఖలు కలిగిన శిలీంధ్రపు పోగులను ( hyphae ) గుర్తించి వ్యాధినిర్ణయము చేయవచ్చును. చికిత్స :

శిలీంధ్రములను అరికట్టు కీటోకొనజాల్ ( ketoconazole ), క్లోట్రిమజాల్ (Clotrimazole),ఎకొనజోల్ (Econazole), మికొనజాల్ (Miconazole),టెర్బినఫిన్ (Terbinafine), సైక్లోపిరాక్స్ (Ci:: 399 ::