పుట:Hello Doctor Final Book.pdf/399

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

39. శిలీంధ్ర చర్మవ్యాధులు - 1 ( Fungal skin diseases - 1 ) శిలీంధ్రములు వృక్షజాతులకు జంతుజాలమునకు విభిన్నమైన జీవరాశులు. ఇవి ఆహారమునకు ఇతర జీవులపై ఆధారపడుతాయి. వీని కణకవచములు ఖైటిన్ అను బహుళ శర్కరను కలిగిఉంటాయి. ఇవి మృతకణములపై జీవిస్తాయి.

చర్మ శిలీంధ్రములు పైచర్మము ( epidermis ) పొరలోను గోళ్ళలోను ఉండు  కెరటిన్ ( keratin  ) లోని మృతకణములపైన, కేశములపైన జీవించి వ్యాధులను కలిగిస్తాయి. ఇవి ఒకరినుంచి వేఱొకరికి, జంతువులనుంచి మనుజులకు, ఒక్కోసారి మట్టినుంచి మనుజులకు సంక్రమించగలవు. కణరక్షణ వ్యవస్థలో లోపములు ఉన్నవారిలో [ ప్రాధమిక రక్షణ లోపము ( Primary immune deficiency ) గలవారిలోను, మధుమేహవ్యాధిగ్రస్థులలోను, హెచ్ ఐ వి వ్యాధిగ్రస్ల థు లోను ] శిలీంధ్రవ్యాధులు ఎక్కువగా కలుగుతాయి. మధుశిలీంద్రము (yeast, Candida), Epidermophyton, Microsporum, Trichophyton జాతుల చర్మాంకురములు (Dermatophytes), శిలీంధ్రవ్యాధులను కలుగజేస్తాయి. స్థానములబట్టి  వ్యాధులను వర్ణిస్తారు. తొడమూలపు తామర ( Tinea cruris ) :

వేసవికాలములో, చెమట ఎక్కువగా పట్టి, గజ్జలలో తేమ అధికముగా ఉన్నపుడు, ఇరుకైన వస్త్రములు ధరించువారిలోను, స్థూలకాయులలోను, ఒరిపిడులు కలుగువారిలోను, ఈ వ్యాధి ప్రాబల్యము ఎక్కువ. పురుషులలో ఈ వ్యాధిని ఎక్కువగా చూస్తాము. Trichophyton rubrum, Trichophyton mentagrophytes గజ్జల తామరను ఎక్కువగా కలుగజేస్తాయి.

398 ::