పుట:Hello Doctor Final Book.pdf/398

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

prim / Sulfamethoxazole ) గాని వాడవచ్చును.

స్టాఫిలోకోక్సై కణతాపము కలిగించునపుడు చీముపొక్కులు (pastules), చీముతిత్తులు (abscesses) ఏర్పడే అవకాశము హెచ్చు. చీముతిత్తులను శస్త్రచికిత్సతో కోసి, చీమును వెలువరించాలి. ఆక్సాసిల్లిన్ (Oxacillin), క్లాక్సాసిల్లిన్ ( Cloxacillin ), డైక్లాక్సాసిల్లిన్ ( Dicloxacillin ) వంటి పెనిసిలినేజ్ కు విచ్ఛిన్నము కాని పెనిసిలిన్ లను గాని, సెఫలెక్సిన్ ( Cephalexin ), సెఫడ్రాక్సిల్ ( Cefadroxil ) వంటి మొదటి తరము సెఫలోస్పోరిన్లను గాని వాడవచ్చును. మిథిసిలిన్ కు లొంగని స్టాఫిలో కోక్సైలు ( Methicillin-Resistant Staphylococcus Aureus ) విరివిగా ఉండు సమాజములలోను, లేక పరిశోధనశాలలలో సూక్ష్మజీవుల పెంపకపు పరీక్షలలో  మిథిసెలిన్ కు లొంగని స్టాఫిలోకోక్సై (MRSA) పెరిగినపుడు, ట్రైమిథాప్రిమ్ / సల్ఫామిథాక్సజోల్ (trimethoprim / slfaamethoxazole), డాక్సీసైక్లిన్ (doxycylnine ), క్లిండామైసిన్ (Clindamycin) లలో ఒక సూక్ష్మజీవినాశకమును ఎంచుకోవాలి. వ్యాధి తీవ్రత హెచ్చుగా ఉన్నపుడు సిరలద్వారా వేంకోమైసిన్ ( Vacomycin ) గాని, లినిజోలిడ్ ( Linezolid ) గాని, డాప్టోమైసిన్  (Daptomycin ) గాని వాడుతారు.

397 ::