పుట:Hello Doctor Final Book.pdf/397

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉంటాయి. వాపు వలన గట్టితనము కలుగుతుంది. మధ్యలో మృదుత్వము చీమును సూచిస్తుంది. అవసరమయినపుడు శ్రవణాతీతధ్వని చిత్రీకరణముతో (ultrasonography) చీముతిత్తులను నిర్ధారించవచ్చును.

వ్యాధినిర్ణయమునకు  సాధారణముగా సూక్ష్మజీవుల పెంపకము (Bacterial cultures) అవసరము ఉండదు. జ్వరము, వణుకు ఉన్నవారిలోను, రక్షణవ్యవస్థ లోపములు (immune deficiency) ఉన్నవారిలోను వారి రక్తముతో సూక్ష్మజీవుల పెంపకపు పరీక్షలు (blood cultures) సలుపవచ్చును. కణజాలమునుంచి కూడా సూక్ష్మజీవుల పెంపకము  (tissue cultures) చేయవచ్చును. చికిత్స :

చర్మాంతర కణజాల తాపమునకు చికిత్స సూక్ష్మజీవ నాశకములు (Antibiotics). సూక్ష్మజీవనాశకములను త్వరగా మొదలు పెట్టుట వలన ఫలితములు బాగుంటాయి. వ్యాధి పూర్తిగా తగ్గే వఱకు వాటిని వాడాలి. ఆ శరీరభాగమును ఎత్తుగా ఉంచుట వలన, చల్లని తేమ కట్లు కట్టుట వలన ఉపశమనము కలుగుతుంది.

పిండికట్లు, తేనెకట్లు, మెగ్నీషియమ్ సల్ఫేట్ + గ్లిసరాల్ (magnesium sulfate + glycerol) కట్లు  ఆ శరీర భాగములో తేమను తీసుకొని  వాపు తగ్గించి ఉపశమనము కలిగిస్తాయి. డైక్లాక్సాసిల్లిన్ ( Dicloxacillin ), సెఫలెక్సిన్ ( cephalexin ), ఎజిథ్రోమైసిన్ ( Azithromycin ), క్లరిథ్రోమైసిన్ ( Clarithromycin), లీవోఫ్లాక్ససిన్  (Levofloxacin), మోక్సీఫ్లాక్ససిన్ ( Moxifloxacin ), క్లిండామైసిన్ (Clindamycin) లలో ఒకదానిని ఎన్నుకొనవచ్చును.

కుక్కకాట్లు, పిల్లికాట్లు వలన కణతాపము కలిగితే ఎమాక్ససిలిన్ / క్లావ్యులనేట్ ( Amoxicillin  / clavulanate ) ని వాడుతారు. పెనిసిలిన్ అసహనము ( sensitivity ) కలిగిన వారికి క్లిండామైసిన్ + సిప్రోఫ్లాక్ససిన్ ( Ciprofloxacin ) లేక మరో ఫ్లోరోక్వినలోన్ ( fluoroquinolone ) గాని, ట్రైమిథాప్రిమ్ / సల్ఫామిథాక్సజోల్ ( Trimetho:: 396 ::