పుట:Hello Doctor Final Book.pdf/396

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

Vulnificus వలన కణజాల తాపములు కలుగవచ్చును.

ఒరుపులు, దెబ్బలు, శిలీంధ్రవ్యాధులు (fungal infections) గలవారిలోను, ఉబ్బుసిరలు గలవారిలో చర్మతాపము కలుగునపుడు, బోదకాలు వ్యాధిగ్రస్థులలో చర్మము చిట్లినపుడు సూక్ష్మజీవులు చర్మములోనికి చొచ్చుకొని చర్మాంతర కణతాపము (cellulitis ) కలిగించే అవకాశము ఉన్నది. కణజాలతాప లక్షణములు :

చర్మాంతర కణతాపము శరీరములో ఎచటనైనా కలుగవచ్చు. కాని సాధారణముగా కాళ్ళలో కలుగుతుంది.దీని వలన  చర్మము ఎఱ్ఱబారుతుంది. వాపు కనిపిస్తుంది. వాపుతో చర్మము దళసరిచెంది నారింజపండు తొక్కను (peu d’ orange) పోలి ఉంటుంది. రక్తప్రసరణ హెచ్చగుట వలన ఆ భాగము వెచ్చగా ఉంటుంది. రోగికి నొప్పి ఉంటుంది. తాకినా, అదిమినా చాలా నొప్పి కలుగుతుంది. ఆ భాగము నుంచి ముందు దిశలో ఎఱ్ఱగా ఉబ్బిన రసినాళములు (lymphatics) గీతలు వలె కనిపించవచ్చు. తాపము బారి పడిన భాగపు అంచులు స్పష్టముగా ఉండవు. కేశరక్తనాళికల నుంచి రక్తము స్రవించుటచే ఎఱ్ఱని చిన్న మచ్చలు కనిపించవచ్చును. చర్మముపై నీటిపొక్కులు (vesicles), బొబ్బలు (bullae) ఏర్పడవచ్చును. బొబ్బలు చిట్లి రసి కారవచ్చును. సూక్ష్మజీవులు రసినాళికల (lymphatic channels) ద్వారా ఆ ప్రాంతీయపు  రసిగ్రంథులకు (lymph nodes) (గజ్జలలోను, చంకలలోను, దవడ కింద)  వ్యాపిస్తే ఆ రసిగ్రంథులు (lymph nodes) వాచి, నొప్పి కలిగించవచ్చును. చికిత్స ఆలస్యమయితే చీముపొక్కులు (pustules ), చీముతిత్తులు ( abscesses ) ఏర్పడవచ్చును. జ్వరము, తలనొప్పి, చలి, వణుకు, మతిభ్రంశము (Delerium), రక్తపీడనము తగ్గుట (hypotension) రక్తములో సూక్ష్మజీవుల వ్యాప్తిని (sepsis), వ్యాధి తీవ్రతను సూచిస్తాయి. వ్యాధి నిర్ణయము :  రోగిని పరీక్షించి వైద్యులు రోగనిర్ణయము చేయగలరు. ఎఱ్ఱదనము, ఉష్ణము, వాపు, నొప్పి తాప లక్షణములు వీరిలో

395 ::