పుట:Hello Doctor Final Book.pdf/395

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొద్ది సంవత్సరములలో పెనిసిలినేజ్ (Penicillinase) అనే జీవోత్ప్రేరకమును ఉత్పత్తిచేసి, పెనిసిలిన్ లోని బీటా లాక్టమ్ చక్రమును (beta-lactam ring ) ధ్వంసముచేసి, పెనిసిలిన్ కు లొంగని స్టాఫిలోకోక్సై విరివిగా వ్యాప్తి పొందాయి. వాటికి విరుగుడుగా శాస్త్రజ్ఞులు పెనిసిలినేజ్ కు ( Penicillinase, also known as beta lactamase)  విచ్ఛిన్నము కాని పెనిసిలిన్లను (penicillinase resistant Penicillins) కనుగొన్నారు. వీటిలో మిథిసిలిన్ ( methicillin) మొదటిది. ఆక్సాసిల్లిన్ ( Oxacillin ), క్లాక్సాసిల్లిన్ ( Cloxacillin), డైక్లాక్సాసిల్లిన్ లు (dicloxacillin ) ఈ కోవకు చెందినవి.

కొన్నేళ్ళకు మిథిసిల్లిన్ కు కూడా లొంగని స్టాఫిలోకోక్సై (Methicillin-Resistant Staphylococcus Aureus : MRSA) వృద్ధిచెందాయి. వీటి కణకుడ్యముల నిర్మాణమునకు తోడ్పడు  ట్రాన్స్ పెప్టైడేజులపై (meca అనే జన్యువుల  వలన) బీటాలాక్టమ్ ల ప్రభావము ఉండదు. అందువలన బీటాలాక్టమ్ ల సమక్షములో కూడ MRSA కణ విభజనతో వృద్ధి  పొందుతాయి. కణజాల తాపమును (Cellulitis) అరుదుగా కలిగించు సూక్ష్మజీవులు :

వృద్ధులలోను, మధుమేహవ్యాధిగ్రస్థులలోను గ్రూప్ బి ష్ట్రెప్టోకోక్సై (స్ట్రెప్టోకోకస్ ఏగలక్టియా, Streptococcus agalactiae) వలన, పిల్లలలో హీమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా (Haemophilus influenza) వలన, మధుమేహవ్యాధిగ్రస్థులలోను, తెల్లకణముల హీనత (Leukopenia) కలవారిలోను, వేడినీటి తొట్టెలలో స్నానము చేసేవారిలోను సూడోమొనాస్ ఏరుజినోసా (Pseudomonas aeruginosa) వలన చర్మాంతర కణజాల తాపములు కలుగగలవు. పిల్లి కాట్లు పిదప పాస్ట్యురెల్లా మల్టోసిడా ( pasteurella multocida ) వలన, కుక్కకాట్లు పిమ్మట కాప్నోసైటోఫగా Capnocytophaga వలన, మంచినీటి కొలనుల మునకలలో గాయముల తర్వాత Aeromonas hydrophila వలన, ఉప్పునీటి మునకలలో గాయముల పిదప Vibrio

394 ::