పుట:Hello Doctor Final Book.pdf/394

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లో చర్మము (dermis), అధశ్చర్మ కణజాలములో (subcutaneous tissue) కలిగే ఈ తాపము వలన ఉష్ణము, ఎఱ్ఱదనము, వాపు, నొప్పి వంటి తాపలక్షణములు (signs of inflammation) కనిపిస్తాయి. ఆ శరీరభాగమును తాకితే నొప్పి (tenderness) కలుగుతుంది. ఆ భాగములో మృదుత్వము తగ్గి గట్టితనము ( induration) ఏర్పడుతుంది. రోగులకు  జ్వరము కలుగవచ్చును. సూక్ష్మజీవులు రసినాళికల (lymhatics) ద్వారా సమీపపు రసిగ్రంథులకు (lymph glands) వ్యాపిస్తే ఆ గ్రంథులు తాపముతో పెద్దవయి నొప్పి కలిగించవచ్చును. ఆ గ్రంథులలో చీముతిత్తులు (abscesses) ఏర్పడవచ్చును. కణతాపమునకు సత్వర చికిత్స అవసరము. చికిత్సలో ఆలస్యము జరిగితే కణతాపము వ్యాపించి సూక్ష్మజీవులు రక్తములోనికి ప్రవేశించి యితర అవయవములకు చేరగలవు. స్థానికముగా తెల్లకణములు (Leukocytes), యితర భక్షకకణములు (phagocytes) సూక్ష్మజీవులను కబళించి, వాటిని చంపుట వలన, అవి మరణించుట వలన, ఆ ప్రాంతములో కణముల విధ్వంసము వలన, చీము ఏర్పడి చీముతిత్తులు (abscesses) ఏర్పడగలవు. రక్తములో సూక్ష్మజీవులు చేరి రక్తమును సూక్ష్మజీవ విషమయము (bacterial sepsis) చేయవచ్చును.

కణజాలతాపము సాధారణముగా గ్రూప్ బి హీమొలైటిక్ స్ట్రెప్టోకోక్సై (gropup B hemolytic streptococci. eg. Streptococcus pyogenes) వలన కలుగుతుంది. కొందఱిలో Staphylococcus aureus వలన కలుగుతుంది. ఈ స్టాఫిలోకోక్సై ఆరియస్ మిథిసిల్లిన్ కు లొంగనివి (Methicillin resistant  Staphylococcus Aureus MRSA) కావచ్చును పెనిసిలిన్ కనుగొనబడిన కొత్తలో చాలా సూక్ష్మజీవులు, స్టాఫిలోకోక్సైలు పెనిసిలిన్ కు లొంగేవి. సూక్ష్మజీవుల కణములు విభజన పొందునపుడు కణకుడ్యముల ( Cell walls ) నిర్మాణమునకు పెనిసిలిన్ అంతరాయము కలిగిస్తుంది. అందువలన సూక్ష్మజీవులు వృద్ధిచెందజాలవు. శరీర రక్షణవ్యవస్థ  ఉన్నవాటిని ధ్వంసం చేస్తుంది.

393 ::