పుట:Hello Doctor Final Book.pdf/393

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పైన, శ్వాసపథములోన, ప్రేవులలోను హాని కలిగించక ఉంటాయి. కొన్ని అవకాశము చిక్కినపుడు వ్యాధులకు కారణము అవుతాయి. శరీర కణజాలముపై ఇవి దాడి చేసినపుడు వీటి నుంచి జనించే  జీవవిషములు (toxins ) వ్యాధులను కలుగజేస్తాయి. కణతాపము ( Cellulitis ) :

చర్మములోనికి సూక్ష్మాంగజీవులు చొచ్చుకొని, వృద్ధిచెంది లోపలి చర్మములోను, అధశ్చర్మ (చర్మము కింద) కణజాలములోను తాపము (inflammation) కలిగించగలవు. గ్రూప్ ఎ హీమొలైటిక్  ష్ట్రెప్టోకోకై  (grou p A hemolytic streptococci), ష్టాఫిలోకోకస్ ఆరియస్ ( Staphylococcus aureus ) సూక్ష్మజీవులు వలన సాధారణముగా ఈ చర్మాంతర కణజాలతాపము (Cellulitis) కలుగుతుంది.

స్ట్రెప్టోకోక్సై (streptococci) వలన కలిగే కణజాలతాపము త్వరితముగా వ్యాప్తిచెందుతుంది. ఈ సూక్ష్మజీవులు ఉత్పత్తి చేసే స్ట్రెప్టోకైనేజ్ (streptokinase), హయలురానిడేజ్ (hyaluronidase), డి ఎన్ ఏజ్ (Dnase) వంటి జీవోత్ప్రేరకములు (enzymes) కణజాల బంధనములను విచ్ఛేదించి సూక్ష్మజీవుల కట్టడికి ఆటంకము కలుగజేస్తాయి. స్టాఫిలోకోక్సై (staphylococci) వలన కలిగే కణ తాపము త్వరగా వ్యాపించక కొంత ప్రాంతమునకు, గాయములకు, చీముతిత్తులకు ( abscesses ) పరిమితమై ఉంటుంది.

392 ::