పుట:Hello Doctor Final Book.pdf/392

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38. కణతాపము ( Cellulitis ) మనకు  కొన్నివ్యాధులు యితర జీవరాశుల వలన కలుగుతాయి. వీనిలో సూక్ష్మాంగజీవులు (bacteria) శరీరముపై దాడిచేసి కొన్ని ఆక్రమణవ్యాధులకు (infections) కారణము అవుతాయి. సూక్ష్మాంగజీవులు ( Bacteria ) :

సూక్ష్మాంగజీవులు ఏకకణజీవులు. వీటికి కణకవచము, కణ వేష్టనము ఉన్నా, పొరలలో అమరిన న్యూక్లియస్లు, మైటోఖాండ్రియాలు ఉండవు. సూక్ష్మ జీవులను గ్రామ్స్ వర్ణకము చేర్చి సూక్ష్మదర్శిని క్రింద చూసి అవి గ్రహించు వర్ణకముల బట్టి గ్రామ్ పోజిటివ్, గ్రామ్ నెగెటివ్ సూక్ష్మ జీవులుగా విభజిస్తారు. గ్రామ్ పోజిటివ్ సూక్ష్మజీవులు ఊదారంగులో ఉంటాయి. గ్రామ్ నెగెటివ్ సూక్ష్మజీవులు గులాబిరంగులో ఉంటాయి. ఆకారమును బట్టి వీనిని గోళాకార సూక్ష్మజీవులు (cocci), కోలలు ( rods ), సర్పిలములుగా (spirals) వర్ణిస్తారు. చాలా సూక్ష్మాంగజీవులు మన శరీరముపైన, శరీరములోపల హాని కలిగించకుండా జీవిస్తున్నా, కొన్ని  అవకాశము చిక్కినపుడు శరీర అవయవములు, కణజాలముల లోనికి చొచ్చుకొని వ్యాధులు కలిగిస్తాయి. కొన్ని సూక్ష్మజీవులు కలుషిత ఆహారము, కలుషిత పానీయములు, లేక కలుషిత వాయువు ద్వారా శరీరము లోనికి ప్రవేశించి వ్యాధులకు కారణమవుతాయి. గ్రామ్ పోజిటివ్ గోళ సూక్ష్మజీవులలో ష్టాఫిలోకోక్సై ( staphylococci ) గుంపులుగా రెండు, నాలుగు లేక అధికసంఖ్యలో గుమికూడి సూక్ష్మదర్శిని క్రింద ద్రాక్షగుత్తుల వలె కనిపిస్తాయి. ఇవి విరివిగా చర్మముపైన, శ్వాసపథములోను నివసిస్తాయి. ష్ట్రెప్టోకోక్సై కూడా గోళాకారపు గ్రామ్ పోజిటివ్ సూక్ష్మజీవులు. ఇవి వరుసలలో గొలుసుల వలె ఉంటాయి. కొన్ని జాతుల ష్ట్రెప్టోకోక్సై చర్మము

391 ::