పుట:Hello Doctor Final Book.pdf/391

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సిరలద్వారా ఇచ్చుటకు  డాక్సీసైక్లిన్ (Doxycycline), క్లిండామైసిన్ (Clindamycin), వేంకోమైసిన్ (Vancomycin), లినిజోలిడ్ (Linezolid), డాప్టోమైసిన్ (Daptomycin), టెలవాన్సిన్ (Telavancin) మందులు లభ్యము. వ్యాధి తీవ్రముగా ఉన్నపుడు, కణజాల తాపము ( cellulitis ) విస్తృతముగా ఉన్నపుడు, జ్వరము ఉన్నవారికి  యీ మందులు సిరలద్వారా వాడుట మేలు.

మఱల, మఱల సెగగడ్డలు వచ్చేవారు క్లోర్ హెక్సిడిల్ సబ్బులు వాడి చర్మము శుభ్రపఱచుకోవాలి. రెండు ముక్కుపుటములలో మ్యుపిరోసిన్ (mupirocin) లేపనమును దినమునకు రెండు మూడు పర్యాయములు అద్దుకొవాలి. అలా చేయుటవలన ముక్కుపుటములలో వసించు సూక్ష్మజీవులు నిర్మూలించబడతాయి.  ఒకటి, రెండు నెలలు సూక్ష్మజీవనాశక ఔషధములను వాడవలసిన అవసరము రావచ్చును. మధుమేహము, స్థూలకాయము వంటి రుగ్మతలను కూడా అదుపులో పెట్టుకోవాలి.

390 ::