పుట:Hello Doctor Final Book.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇన్సులిన్ అవలంబిత మధుమేహవ్యాధిగ్రస్థులు (Type -1 insulin dependent diabetes) మౌలిక (basal) ఇన్సులిన్ + భోజనపూర్వపు (premeal) ఇన్సులిన్లు గా ఇన్సులిన్లను ఎక్కువ పర్యాయములు (multiple daily injections) తీసుకోవలసి ఉంటుంది. అధిక చక్కెర విలువలకు సవరణ ఇన్సులిన్ (corrective insulin) అదనముగా తీసుకోవలసి ఉంటుంది. ఇన్సులిన్ అవసరము ఉన్న మధుమేహవ్యాధిగ్రస్థులు వారి చక్కెర విలువలను చక్కెరమాపకముతో (glucose monitor) ప్రతి భోజనమునకు ముందు, రాత్రి నిద్రకు ముందు దినమునకు నాలుగు సార్లు చూసుకొనుట మంచిది.

తఱచు చక్కెర విలువలు పరీక్షించుట, రక్తపు చక్కెరవిలువలు అధికము, అల్పము కాకుండా చూసుకొనుట అవసరము. మందుల వలన విపరీత ఫలితములు ఉండవచ్చును. మెట్ ఫార్మిన్ వలన కొందఱిలో జీవవ్యాపార ఆమ్లీకృతము (Metabolic Acidosis), మూత్రాంగ వైఫల్యము అరుదుగా కలుగవచ్చును. అందుచే అప్పుడప్పుడు రక్తపరీక్షలు అవసరమే. వ్యాధిగ్రస్ల థు కు క్రమశిక్షణ, వైద్యుల సలహాలను పాటించుట, తఱచు చక్కెరలను పరీక్షించు కొనుట, వాడే మందులపై సదవగాహము అవసరము. తగినంత వ్యాయామము చాలా అవసరము. జటిల పరిస్థితుల లక్షణాలు కలిగితే సత్వర చికిత్సకు వైద్యులను సంప్రదించుట చాలా ముఖ్యము. ప్రపంచములో 400,000,000 మందికి పైగా మధుమేహ వ్యాధిగ్రస్థులు ఉన్నారంటే వ్యాధి ప్రాబల్యము తెలుస్తుంది.

39 ::