పుట:Hello Doctor Final Book.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొందఱిలో మధ్యస్థ లేక దీర్ఘకాలిక ఇన్సులిన్ + సత్వర ఇన్సులిన్ ల మిశ్రమము దినమునకు ఒకటి లేక రెండు పర్యాయములు భోజనమునకు ముందు తీసుకుంటే రక్తపు చక్కెరవిలువలు, హీమోగ్లోబిన్ ఎ-1 సి విలువలు అదుపులో ఉండవచ్చు.

కొందఱిలో దినమునకు ఒకటి లేక రెండు పర్యాయములు మధ్యస్థ లేక దీర్ఘకాలిక ఇన్సులిన్ మౌలికపు ఇన్సులిన్ గా (basal insulin) దినమంతా చక్కెర విలువలను అదుపులో ఉంచుటకు వాడి ప్రతి భోజనమునకు ముందు సత్వర ఇన్సులిన్ ను కూడా వాడ వలసి ఉంటుంది. భోజన పూర్వపు (premeal) ఇన్సులిన్లు భోజనము వలన పెరిగే చక్కెర విలువలను సమస్థితిలో ఉంచుటకు తోడ్పడుతాయి.

మౌలిక + భోజనపూర్వ ఇన్సులిన్లు (basal insulin + premeal insulin) వాడునపుడు దినమునకు అవసరమయే మొత్తపు ఇన్సులిన్ లో సుమారు 50-60 శాతపు ఇన్సులిన్ ను మౌలిక (basal) ఇన్సులిన్ గా వాడుతారు. ఈ మౌలిక ఇన్సులిన్ మోతాదును ఉపవాసపు (fasting) చక్కెర విలువలు 130 మి.గ్రాలు కంటె తక్కువగా ఉండునట్లు సవరించు కోవాలి. భోజన పూర్వపు (premeal) ఇన్సులిన్ ను ఆ యా భోజనముల పరిమాణము అందులో ఉన్న పిండిపదారము ్థ ల పరిమాణముల బట్టి నిర్ణయించు కోవలసి ఉంటుంది. చక్కెరవిలువలు గమనిస్తూ మోతాదులను సవరించు కోవాలి. ఉదయము పరగడుపు చక్కెర విలువలు కాని, మిగిలిన పూటలలో భోజనమునకు ముందు చక్కెర విలువలు కాని ఎక్కువగా (150 మి.గ్రాలు మించి) ఉన్నపుడు వాటిని అదుపులో పెట్టుటకు అదనపు సత్వర ఇన్సులిన్ తీసుకోవలసి ఉంటుంది. ఆ అదనపు ఇన్సులిన్ ను సవరణ ఇన్సులిన్ గా (correction factor) వ్యవహరిస్తారు.

అట్లే భోజనమునకు ముందు చక్కెరవిలువలు బాగా తక్కువగా ఉన్నపుడు (80-90 మి.గ్రాలు లోపల) భోజనపూర్వపు ఇన్సులిన్ మోతాదును తగ్గించుకోవలసి ఉంటుంది.

38 ::