పుట:Hello Doctor Final Book.pdf/389

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రక్తము స్రవిస్తాయి.

సెగగడ్డలు గుంపులుగా ఒకచోట ఏర్పడి, తాపప్రక్రియ (inflammation) చర్మమునకు, చర్మాంతర కణజాలమునకు (subcutaneous tissue) వ్యాపించి అచట చీముతిత్తులు (abscesses) ఏర్పడుట వలన రాచకురుపులు (Carbuncles) ఏర్పడుతాయి. రాచకురుపులులో వ్యాధి తీవ్రత హెచ్చుగా ఉంటుంది. వీరిలో నొప్పి, వాపులతో పాటు, జ్వరము, నీరసము కూడా కలుగుతాయి. రాచకురుపులు పైమెడ వెనుక భాగములో (nape of the neck) ఎక్కువగా చూస్తాము. రాచకురుపులు కలిగిన వారు మధుమేహవ్యాధిగ్రస్థులైనచో మధుమేహ తీవ్రత కూడా పెరుగుతుంది.

సెగగడ్డలు పిల్లలు, యువకులలో కలిగినా, ఎక్కువగా శరీర రక్షణవ్యవస్థ సన్నగిల్లిన వారిలోను, వృద్ధులలోను, స్థూలకాయులలోను, తెల్లకణముల వ్యాధులు కలవారిలోను, మధుమేహవ్యాధిగ్రస్థులలోను, దీర్ఘకాలముగా చర్మము, నాసికా పుటములలో ష్టాఫిలోకోక్సై స్థిరవాసము ఏర్పఱుచుకొన్నవారిలోను ( colonization ) కలుగుతాయి. వేసవిలో చెమట ఎక్కువైనపుడు, రోమకూపములు పూడుకొన్నపుడు సెగగడ్డలు ఎక్కువగా చూస్తాము.

388 ::