పుట:Hello Doctor Final Book.pdf/388

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

lin  Resistant Staphylococcus Aureus MRSA) వ్యాధి కారకములైనచో  డాక్సీసైక్లిన్ కాని,  క్లిండామైసిన్  కాని, ట్రైమిథాప్రిమ్ / సల్ఫామిథాక్సజోల్ కాని ఎంచుకొవాలి. వ్యాధిగ్రస్థుల అసహనములు ( allergies ) కూడా పరిగణనలోనికి తీసుకోవాలి. ష్ట్రెప్టోకోక్సై చాలా సూక్ష్మజీవ నాశకములకు లొంగుతాయి.

చికిత్స చేయనిచో ఈ వ్యాధుల తీవ్రత పెరిగి, రసిగ్రంధులకు (lymph nodes) వ్యాధి వ్యాపించవచ్చు. చర్మపు దిగువ కణజాలమునకు సూక్ష్మజీవులు వ్యాపించి కణజాల తాపమునకు (cellulitis), చీముతిత్తులకు (abscesses) దారితీయవచ్చును.

చిన్నపిల్లలలో కొన్ని  ష్ట్రెప్టోకోక్సైల వలన [nephritogenic strains of group A Strptococci ( types 49, 55, 57, 59)] చర్మవ్యాధులు కలిగితే, వాటివలన మూత్రాంగముల కేశనాళికాగుచ్ఛములలో తాపము (post streptococcal glomerulonephritis) కలిగే అవకాశము ఉంది. అసహనము వలన చర్మతాపము (atopic dermatitis) కలిగిన వారికి కార్టికోష్టీరాయిడ్ లేపనములతోను (corticosteroid creams), శుష్క చర్మవ్యాధి (Xerosis) బాధితులకు  ఆర్ద్ర ఔషధములతోను (moisturizers) చికిత్సలు చేసి చర్మపు సమగ్రతను (skin integrity) పరిరక్షించాలి. సెగగడ్డ ( Boil ; Furuncle ) : రాచకురుపు ( Carbuncle ):

ష్టాఫిలోకోక్సై (staphylococci) వెండ్రుకల మూలములలో (రోమకూపములలో hair follicles) వృద్ధిచెంది కణ ధ్వంసము, తాపము కలిగించుట వలన సెగగడ్డలు (furuncles) కలుగుతాయి. ఇవి తొలుత ఎఱ్ఱని గడ్డలుగా పొడచూపి పిదప చీముతిత్తులుగా (abscesses) మారుతాయి. ఇవి చర్మములో ఎచ్చటైనా రావచ్చును కాని సాధారణముగా ముఖము, మెడ, పిరుదులు, రొమ్ములు పైన కలుగుతాయి. సెగగడ్డలు పెరుగుతున్న కొలది నొప్పి, సలుపు పెరుగుతాయి. ఇవి పగిలినపుడు చీము,

387 ::