పుట:Hello Doctor Final Book.pdf/386

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏర్పడుతాయి. వాటిపై నల్లనిపెచ్చులు ఏర్పడి,  చుట్టూ ఎఱుపుకట్టి ఉంటాయి. వీటివలన నొప్పి, దుఱద, ఇబ్బంది కలుగుతాయి. కారిన రసివలన వ్యాధి పరిసరప్రాంతములకు, ఇతర ప్రాంతములకు వ్యాప్తి చెందుతుంది. ఇతరులకు కూడా ఇవి అంటువ్యాధులుగా వ్యాప్తి చెందగలవు.

ఈ వ్యాధులు ఎవరికైనా సోకవచ్చును. శరీరశుభ్రత తక్కువగా ఉన్నవారిలోను, ముక్కు, నాసికాకుహరములు (para nasal sinuses), శ్వాసపథములలో ఈ సూక్ష్మజీవులను దీర్ఘకాలము వహించే వారిలోను (దీర్ఘకాల వాహకులు; chronic carriers) వీటిని ఎక్కువగా చూస్తాము. పిల్లలలో ఒకరినుంచి మరిఒకరికి ఈ వ్యాధులు వ్యాపించగలవు. అనుభవజ్ఞులైన  వైద్యులు వీటిని చూచి వ్యాధినిర్ణయము చేయగలరు. 20 శాతము మందిలో మిథిసిలిన్ ను ప్రతిఘటించే ష్టాఫిలోకోక్సై (Methicillin Resistant Staphylococcus Aureus) ఈ వ్యాధులను కలిగిస్తాయి. సామాన్య చికిత్సలకు లొంగని ఎడల రసి, చీములతో  సూక్షజీవుల పెంపకము (culture) ఔషధ నిర్ణయపరీక్షలు (sensitivity to antibiotics) సలిపి తగిన  ఔషధములను ఉపయోగించి చికిత్సలు  చేయవలెను. చికిత్సలు :

అంటుపెచ్చుల వ్యాధి (Impetigo ), కోపవ్రణముల (Ecthyma) వ్యాధి  కలవారు ఆ యా భాగముల  చర్మమును గోరువెచ్చని మంచినీటితోను, సబ్బుతోను శుభ్రపఱచి సూక్ష్మజీవ నాశక లేపనములను దినమునకు మూడు, నాలుగు పర్యాయములు పూతగా పూయాలి. మ్యుపిరోసిన్ (Mupirocin), ఒజినాక్ససిన్ (Ozenoxacin), ఫ్యుసిడిక్ ఏసిడ్ ( fusidic acid ) లేపనములు అందుబాటులో ఉన్నాయి. ఎక్కువగా మ్యుపిరోసిన్ లేపనము  వాడుతారు.

వ్యాధులు విస్తృతముగా వ్యాపించి ఉన్నపుడు, తీవ్రముగా ఉన్నపుడు నోటిద్వారా సూక్ష్మజీవ నాశకములను ( antibiotics ) వాడవలసి ఉంటుంది.

385 ::