పుట:Hello Doctor Final Book.pdf/385

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కణజాలముపై ఇవి దాడి చేసినపుడు వీటి నుంచి పుట్టే  జీవవిషములు (toxins ) వ్యాధులను కలుగజేస్తాయి.

చర్మము, చర్మాంతర కణజాలములలో (subcutaneous tissue) సూక్ష్మజీవులు కలిగించు కొన్ని సామాన్యవ్యాధుల గురించి చెప్పుకుందాము. అంటుపెచ్చులు (Impetigo) : కోపవ్రణములు (Ecthyma) :

ష్టాఫిలోకోక్సై వలన కాని ష్ట్రెప్టోకోక్సై వలన కాని ఈ చర్మవ్యాధులు కలుగుతాయి. ఇవి చర్మము మీద వ్యాపించే వ్యాధులు. అంటుపెచ్చులు (Impetigo) :

ఈ వ్యాధిలో చర్మము మీద  నీటిపొక్కులు (vesicles), చీముపొక్కులు (pustules) ఏర్పడుతాయి.  ఇవి చిట్లినపుడు చర్మముపై తేనె రంగులో పెచ్చులు ఏర్పడుతాయి. కొందఱిలో నీటిపొక్కులు పెద్దవయి బొబ్బలు (bullae) ఏర్పడుతాయి, బొబ్బలు పగిలినపుడు తేనెరంగులో పెచ్చుకడుతుంది. కోప వ్రణములు (Ecthyma) :

ఈ వ్యాధిలో చిన్న చిన్న  చీము కారే పుళ్ళు బాహ్యచర్మములో

384 ::