పుట:Hello Doctor Final Book.pdf/384

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

37. సూక్ష్మజీవులు కలిగించు కొన్ని చర్మవ్యాధులు ( Some Bacterial Skin diseases ) మనకు  కొన్నివ్యాధులు యితర జీవరాశుల వలన కలుగుతాయి. వీనిలో సూక్ష్మాంగ జీవులు (bacteria) శరీరముపై దాడిచేసి కొన్ని వ్యాధులకు కారణము అవుతాయి. సూక్ష్మజీవులు ఏకకణ జీవులు. వీటికి కణ కవచము ( cell wall ), కణ వేష్టనము (cell membrane) ఉన్నా, పొరలలో అమరిన న్యూక్లియస్లు, మైటోఖాండ్రియాలు ఉండవు. సూక్ష్మజీవులను గ్రామ్స్ వర్ణకము (Gram’s stain) చేర్చి సూక్ష్మదర్శిని క్రింద చూసి అవి గ్రహించు వర్ణకముల బట్టి గ్రామ్ పోజిటివ్, గ్రామ్ నెగెటివ్ సూక్ష్మజీవులుగా విభజిస్తారు. గ్రామ్ పోజిటివ్ సూక్ష్మజీవులు ఊదారంగులో ఉంటాయి. గ్రామ్ నెగెటివ్ సూక్ష్మజీవులు గులాబిరంగులో ఉంటాయి. ఆకారమును బట్టి వీనిని గోళములు ( cocci ), కోలలు ( rods ), సర్పిలములుగా (spirals) వర్ణిస్తారు. చాలా సూక్ష్మజీవులు మన శరీరముపైన, శరీరములోపల హాని కలిగించకుండా జీవిస్తున్నా, కొన్ని  అవకాశము చిక్కినపుడు శరీర అవయవములు, కణజాలములలోనికి ప్రవేశించి వ్యాధులు కలిగిస్తాయి. కొన్నిసూక్ష్మజీవులు కలుషిత ఆహారము, కలుషిత పానీయములు, లేక కలుషిత వాయువు ద్వారా శరీరములోనికి చొచ్చుకొని వ్యాధులకు కారణము అవుతాయి. గ్రామ్ పోజిటివ్ గోళాకార సూక్ష్మజీవులలో ష్టాఫిలోకోక్సై ( staphylococci ) గుంపులుగా రెండు, నాలుగు లేక అధిక సంఖ్యలో గుమికూడి సూక్ష్మదర్శిని క్రింద ద్రాక్షగుత్తుల వలె కనిపిస్తాయి. ఇవి విరివిగా చర్మముపైన, శ్వాసపథములోను నివసిస్తాయి.

ష్ట్రెప్టోకోక్సై కూడా గోళాకారపు గ్రామ్ పోజిటివ్ సూక్ష్మజీవులు. ఇవి వరుసలలో గొలుసుల వలె ఉంటాయి. కొన్నిజాతుల ష్ట్రెప్టోకోక్సై చర్మముపైన, శ్వాసపథములోన, ప్రేవులలోన హాని కలిగించక ఉంటాయి. కొన్ని అవకాశము చిక్కినపుడు వ్యాధులకు కారణము అవుతాయి. శరీర

383 ::