పుట:Hello Doctor Final Book.pdf/379

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

demics), తీవ్రవ్యాధులు కలుగుతాయి. ఈ జీవాంశముల ఉపరితలముపై హీమగ్లూటినిన్ hemagglutinin (HA) న్యూరెమినిడేజ్ neuramidinase (NA) అనే ప్రతిజనకములు (antigens) ఉంటాయి. ఆ ప్రతిజనకములలో విభాగములబట్టి ఈ విషజీవాంశములను విభజిస్తారు. వీనిలో జన్యుపదార్థము ఎనిమిది ఒంటి పోగుల RNA తునుకలుగా ఉంటుంది. అందువలన కొత్త విషాంశముల ప్రత్యుత్పత్తి జరిగినపుడు జన్యుపదార్థములో మార్పులు (mutations) కలిగే అవకాశములు మెండు. అందువలన ఒకసారి వ్యాపకజ్వరము - ఎ బారిన పడినవారు మఱల ఆ వ్యాధికి గుఱి అయ్యే అవకాశములు ఉన్నాయి.

Influenza -B మనుజులలోనే చూస్తాము. సీలుచేపలకు, ఫెరెట్ పిల్లులకు ఈ వ్యాధి కలుగవచ్చు. ఈ విషజీవాంశములలో పరివర్తనలు (mutations) తఱచు జరగవు. అందువలన చాలా మందికి ఒకసారి సోకగానే వ్యాధిని ఎదుర్కొనే శక్తి కలుగుతుంది. దీనివలన విశ్వవ్యాపక వ్యాధులు కలుగవు.

Influenza - C మనుజులకే కాక పందులకు, కుక్కలుకు కూడా సోకగలదు. ఈ వ్యాధి అసాధారణమైనా తీవ్రముగా ఒక్కొక్క ప్రాంతములో వ్యాప్తి జెందగలదు. Influenza - D వ్యాధి పశువులకు పందులకు సోకుతుంది. మనుజులకు సోకగలిగినా యింతవఱకు మనుజులలో యీ వ్యాధి కలిగిన సూచనలు లేవు. వ్యాపక జ్వరాలు వ్యాప్తి :

వ్యాపక జ్వరము సోకిన వారు దగ్గు తుమ్ముల ద్వారా విషజీవాంశ రేణువులను గాలిలోనికి వెదజల్లుతారు. దగ్గఱలో ఉన్నవారు ఆ నలుసులను పీల్చినా, లేక ఆ నలుసులు పడిన వస్తువులను తాకి ఆ చేతితో ముక్కు, నోరు,కళ్ళను తాకినా, ఆ విషజీవాంశములు శరీరములోనికి ప్రవేశిస్తాయి. వ్యాధి గలవారిని స్పర్శించుట వలన, వారితో కరచాలనములు చేయుట వలన ఆ విషాంశములను అంటించుకొనే అవకాశము ఉన్నది.

378 ::