పుట:Hello Doctor Final Book.pdf/380

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ విషజీవాంశములు వస్తువుల ఉపరితలములపైన 24 నుంచి 48 గంటల వఱకు మనగలవు. తుమ్ములు, దగ్గుల వలన గాలిలో వెదజల్లబడినా అవి త్వరగానే వాటి బరువుకు క్రిందకు చేరుకుంటాయి. గాలిలో ఎక్కువ కాలము ఉండవు. తేమ ఎక్కువగా ఉన్నా, సూర్యకాంతిలో అతినీలలోహిత కిరణాల వలన (ultraviolet rays) ఈ విషాంశములు త్వరగా ధ్వంసము అవుతాయి, సబ్బు, బట్టలసోడా, ఆల్కహాలు ఈ విషాంశములను నశింప చేస్తాయి. విషజీవాంశములు ముక్కు, గొంతుక, ఊపిరితిత్తుల కణముల పొరలకు హీమెగ్లూటినిన్ ల ద్వారా అంటుకొని పిదప కణముల లోనికి చొచ్చుకుంటాయి. ఆ కణములలో వాటి ప్రత్యుత్పత్తి జరిగి అనేక విషజీవాంశములు కణముల నుంచి విడుదలవుతాయి. ఆక్రమించబడిన కణములు ధ్వంసమవుతాయి. వ్యాపక జ్వర లక్షణములు :

స్వల్ప తీవ్రత గల వారిలో ఏ లక్షణములు కనిపించకపోవచ్చును. వ్యాధిసోకిన వారిలో ఒంటినొప్పులు, కండరముల పీకు, శరీరమంతా నలత, గొంతునొప్పి, ముక్కుకారుట, జ్వరము,వణుకు, తలనొప్పి, దగ్గు, కలుగుతాయి. ఈ లక్షణములు రెండుదినముల నుంచి వారము వఱకు ఉండి క్రమేణ రోగులు కోలుకుంటారు. పిల్లలలో వాంతులు, విరేచనములు కలుగవచ్చు. ముక్కు కారుట కొంత ఉన్నా సాధారణ జలుబులో వలె ఎక్కువగా ఉండదు. సాధారణ జలుబు చేసిన వారిలో జ్వరము ఎక్కువగా ఉండదు. ఫ్లూ కలిగిన వారిలో ఒంటినొప్పులు, జ్వరము ఎక్కువగా ఉంటాయి.

వ్యాధినిరోధక శక్తి తక్కువయినవారిలోను, వ్యాధి తీవ్రముగా ఉన్నవారిలోను వ్యాపకజ్వరముతో ఊపిరితిత్తుల తాపము ( Pneumonitis ) విషజీవాంశముల ( viruses ) వలన కాని, ఆ పిమ్మట దాడి సలిపే సూక్ష్మజీవుల ( bacteria ) వలన, లేక రెండిటి వలన కాని కలుగ వచ్చును. విషజీవాంశముల వలన కలిగే ప్రాథమిక పుపుస తాపములో ( Primary pneumonia ) రోగులు త్వరగా కోలుకోక జ్వరము కొనసాగి, పొడి దగ్గు,

379 ::