పుట:Hello Doctor Final Book.pdf/378

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36. వ్యాపక జ్వరము ( Influenza ) వ్యాపక జ్వరాలు ( Influenza ) ప్రతి సంవత్సరము చాలా దేశాలలో పొడచూపుతాయి. ఫ్లూ బహుళ వ్యాపక వ్యాధిగా ( epidemic ) చాలామందికి కలుగవచ్చును. చాలా మందిలో దానంతట అది తగ్గిపోయినా, ఈ జ్వరాలు ప్రపంచము అంతటా వ్యాపించి చాలా మృత్యువులకు కారణమయిన సంఘటనలు ఉన్నాయి. దీని ప్రభావము అనేక జనులపై ఉండుట వలన ఈ వ్యాధికి Influenza అనే పేరు కలిగింది.

సాధారణముగా ఈ వ్యాపక జ్వరాలు పశ్చిమ దేశాలలో ఆకురాల్చు కాలములోను, శీతాకాలములోను పొడచూపుతాయి. వ్యాపక జ్వరములు ఇన్ఫ్లుయెంజా A, B, C, D అనే విషజీవాంశములు ( Viruses ) వలన కలుగుతాయి.

విషజీవాంశములు (viruses) అతిసూక్ష్మమైనవి. వీటికి కణ నిర్మాణము ఉండదు. వాటంతట అవి మనజాలవు. వాటంతట అవి ప్రత్యుత్పత్తి చెందజాలవు. వీటిలో జీవరాశులలో వలె జీవవ్యాపారక్రియలు జరుగవు. ఈ విషజీవాంశములు యితర జీవకణాలలో ప్రత్యుత్పత్తి అవుతాయి. ఇవి న్యూక్లియక్ ఆమ్లములతో (Nucleic acids) నిర్మితమవుతాయి. వీనిలో పొందుపఱచబడిన న్యూక్లియక్ ఆమ్లము బట్టి డీఆక్సీరైబోజ్ న్యూక్లియక్ ఆమ్ల విషజీవాంశములు (DNA Viruses), రైబోజ్ న్యూక్లియక్ ఆమ్ల విషజీవాంశములు (RNA Viruses) గాను వీనిని విభజించవచ్చు. వ్యాపకజ్వరాలు (Influenza) కలిగించే విషజీవాంశములు రైబోజ్ న్యూక్లియక్ ఆమ్ల విషజీవాంశములు RNA Viruses). ఇవి Orthomyxoviridae సముదాయమునకు చెందుతాయి. Influenza - A మనుజులకే కాక యితర క్షీరదములకు, పక్షులకు కూడా వ్యాధిని కలిగించగలవు. వీటివలనే విశ్వవ్యాపక వ్యాధులు (Pan:: 377 ::