పుట:Hello Doctor Final Book.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ్ లూ కగాన్ వంటి పెపటై ్ డు-1 ప్రేరేపకములు (Glucagon - like- peptide -1 analogs) :

ఈ ఔషధములు జి.ఎల్.పి-1 గ్రాహకములను ప్రేరేపించి ఇన్సులిన్ స్రావకమును ఇనుమడింపజేస్తాయి. ఆల్బిగ్లుటైడ్ (Albiglutide), డ్యూలగ్లుటైడ్ (Dulaglutide), ఎక్సినటైడ్ (Exenatide), లిరగ్లుటైడ్ (Liraglutide) ఈ తరగతికి చెందినవి. వీటిని చర్మము క్రింద సూదిమందుగా తీసుకోవాలి. ఇదివరలో క్లోమతాపము (pancreatitis) కలవారిలోను, గళగ్రంథిలో మెడుల్లరీ కర్కటవ్రణములు (medullary thyroid carcinomas) కలవారిలోను ఈ మందులను వాడకూడదు. ఈ ఔషధములలో మధుమేహవ్యాధి తీవ్రతను బట్టి ఒకటి లేక రెండు మందులను మొదలుపెట్టి రక్తపు చక్కెర విలువలను గమనిస్తూ వాటి మోతాదులను క్రమేణ సవరించాలి. మందుల మోతాదులు అధిక ప్రమాణములకు చేరినాసరే మధుమేహవ్యాధి అదుపులోనికి రాకపోతే కొత్తమందులను వాటికి క్రమేణ చేర్చాలి. అవాంఛిత ఫలితములను కూడా గమనిస్తూ ఉండాలి. నియమితాహారము, తగిన వ్యాయామములను విడువకూడదు.

పై ఔషధములతో మధుమేహమును నియంత్రించ లేనపుడు ఆ ఔ ష ధ ము ల తో బాటు ఇన్సులిన్ వాడుక మొదలుపెట్టాలి. రెండవరకపు మధుమేహము క్లోమములో బీటా కణముల (beta cells of islets of Langerhans) విధ్వంసము వలన కలుగుతుంది. కాబట్టి ఆ విధ్వంసము కొనసాగుటచే చాలా మందిలో వారి జీవితకాలములో ఇన్సులిన్ వాడుక అవసరము పడుతుంది. ఇన్సులిన్లు ( Insulins ) :

సహజమైన ఇన్సులిన్ (Regular Insulin) క్లోమములో స్రవించ బడుతుంది. 1921 లో కనుగొనబడిన సహజ ఇన్సులిన్ చాలా సంవత్సరములు వాడుకలో ఉన్నా, తర్వాత పరిశోధనల ఫలితముగా చాలా రకాల ఇన్సులిన్లు వాడుకలోనికి వచ్చాయి. ఇన్సులిన్లను క్రింది విధముగా విభజిస్తారు. సత్వర ఇన్సులిన్లు (Rapid acting insulins) : లిస్ప్రో (lis:: 36 ::