పుట:Hello Doctor Final Book.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

డి.పి.పి-4 అవరోధకములు (Dipeptidyl peptidase -4 inhibitors) :

ఇవి డైపెప్టిడిల్ పెప్టైడేస్-4 అనే జీవోత్ప్రేరకమును అవరోధించి ఇన్ క్రెటిన్స్ (incretins) క్షీణతను మందగింపజేస్తాయి. ఇన్క్రెటి్న్లు గ్లూకగాన్ విడుదలను మందగింపజేసి (గ్లూకగాన్ చక్కెర విలువలను పెంచుతుంది), ఇన్సులిన్ స్రావకమును పెంచుతాయి. రక్తములో చక్కెర విలువలను తగ్గిస్తాయి.

వీనిని అదివరలో క్లోమతాపము కలిగిన వారు వాడకూడదు. వీని వలన చర్మవిస్ఫోటములు (rash), దద్దుర్లు, చర్మములో పొంగులు (angioedema) వంటి అవాంఛిత ఫలితములు కలుగ వచ్చును. ఆలోగ్ప్ లి న్ టి (Alogliptin), లినగ్ప్ లి న్ టి (Linagliptin), సాక్సాగ్లిప్న్ టి (Saxagliptin), సిటగ్లిప్టిన్ (Sitagliptin) ఈ తరగతికి చెందిన ఔషధములు.

ఆల్ఫాగ్లూకోసైడేజ్ అవరోధకములు (Alpha Glucosidase inhibitors)

ఇవి చిన్నప్రేవుల లోపొరలో గల ఆల్ఫా గ్కో లూ సైడేజ్ అనే జీవోత్ప్రేరకమును అవరోధించి బహుళ శర్కరలు (polysaccharides) ఏకశర్కరులుగా (monosaccharides) మార్పుచెందుటను అవరోధిస్తాయి. అందువలన చక్కెరలు త్వరగా రక్తములోనికి గ్రహింపబడవు. భోజనము పిమ్మట చక్కెర విలువలు (postprandial blood sugars) త్వరగా పెరిగిపోవు.

సోడియమ్ గ్ లూ కోజ్ కోట్రాన్స్పోర్ట ర్ - 2 అవరోధకములు (Sodium glucose cotransporter -2 inhibitors) :

ఇవి మూత్రనాళికల పూర్వభాగములో (proximal convoluted tubules) చక్కెరల పునర ్గ ్ర హ ణమును (reabsorption) తగ్గించి మూత్రములో చక్కెర నష్టమును పెంచి రక్తపు చక్కెర విలువలను తగ్గిస్తాయి. మూత్రాంగ వ్యాధులు కలవారు వీటిని వాడకూడదు. కెనగ్లిఫ్లొజిన్ (Canagliflozin), డాపాగ్లిఫ్లొజిన్ (Dapagliflozin), ఎంపాగ్లిఫ్లొజిన్ (Empagliflozin) ఈ తరగతికి చెందిన ఔషధములు.

35 ::