పుట:Hello Doctor Final Book.pdf/368

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(Antiviral medicines) వ్యాధిపై ఫలితములను చూపవు. అందువలన ఒక మాసముపైన, 12 సంవత్సరములలోపు వయస్సు ఉన్నవారికి విషజీవాంశములను అదుపులో పెట్టు మందులను వాడరు.

వయోజనులలో వ్యాధి పొడచూపిన 48 గంటల లోపల వాడే ఎసైక్లొవీర్, వాలసైక్లొవీర్ (valacyclovir) వంటి మందులు వ్యాధి త్వరితముగా తగ్గుటకు ఉపయోగపడుతాయి. గర్భిణీస్త్రీలు, వ్యాధినిరోధక శక్తి కొఱవడినవారికి యీ మందులను త్వరగా మొదలుపెట్టుట మంచిది. వ్యాధి తీవ్రముగా ఉన్నవారికి, యితర చిక్కులు, సమస్యలు కలిగినవారికి ప్రతిరక్షకముల గ్లాబ్యులిన్ (Varicella Zoster Immune Globulin - VZIG ను వాడుతారు. వ్యాధినిరోధము :

పిల్లలకు ఆటాలమ్మ టీకాలు వేయుటవలన అధిక సంఖ్యలో (80 శాతము మందిలో) వ్యాధిని నిరోధించగలము. వ్యాధిగ్రస్థులను మిగిలిన వారికి దూరముగా ఉంచుట వలన వ్యాధి వ్యాప్తిని అరికట్టగలము. అగ్గి చప్పి / అగ్నిసర్పి / ఒడ్డా ణపు చప్పి / మేఖల విసర్పిణి, ( Shingles / Herpes Zoster ) :

అగ్నిసర్పి (అగ్గిచప్పి, ఒడ్డాణపు చప్పి, మేఖలవిసర్పిణి) సాధారణముగా పెద్దవారిలోను, వ్యాధి నిరోధకశక్తి కొఱవడినవారిలోను కనిపిస్తుంది.

367 ::