పుట:Hello Doctor Final Book.pdf/366

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

Shingles) పొక్కులను తాకుటవలన కూడా వ్యాధినిరోధకశక్తి లేని వారికి ఆటాలమ్మ సోకవచ్చును.

ఆటాలమ్మ విషజీవాంశములు శరీరములో ప్రవేశించాక 10 నుంచి 21 దినముల వఱకు వ్యాధిలక్షణములు పొడచూపవు. ఈ అంతర్గతస్థితి కాలములో (Incubation Period) విషజీవాంశములు వృద్ధి చెందుతుంటాయి. ప్రారంభదశలో చిన్నపిల్లలలో ఏ లక్షణాలు కనిపించక పోవచ్చును. తరుణవయస్కులలోను, పెద్దవారిలోను, నలత ( malaise ), వమనభావన ( Nausea ), ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, జ్వరము, ముక్కు కారుట వంటి లక్షణములు కనిపించవచ్చును.

ఆపై విస్ఫోటము (Rash) పొడచూపుతుంది. తొలుత చిన్న చిన్న ఎఱ్ఱటిమచ్చలు అచ్చటచ్చట కనిపిస్తాయి. ఈ మచ్చలు విరివిచెంది, పొక్కులుగాను (papules) తరువాత దినములలో నీటిపొక్కులుగాను (vesicles), ఆపై చీముపొక్కులుగాను (pustules) పరిణామము చెందుతాయి. తరువాత దినములలో పొక్కులు మాడి, పెచ్చులు కట్టి ఆ పెచ్చులు రాలిపోతాయి. ఈ పొక్కులు పరంపరలుగా వచ్చుట వలన ఒకే సమయములో వివిధ దశల స్ఫోటకములు కనిపిస్తాయి. ఈ విస్ఫోటము వలన దుఱద కలుగవచ్చును. నొప్పి కలుగదు. కొందఱిలో దౌడలలోను అంగుడిలోను చిన్న పొక్కులుగాని, పుళ్ళుగాని పొడచూపుతాయి. నొప్పి, దురద యీ పొక్కులవలన కలుగవచ్చును.

ఆటాలమ్మలో విస్ఫోటము ఛాతిపైన, వీపుపైన, ఉదరముపైనా, తల, చేతులు, ముంజేతులు, తొడలు, కాళ్ళ పైనా కనిపిస్తుంది.

విస్ఫోటము కనిపించుటకు రెండుదినములు ముందునుంచి వ్యాధిగ్రస్థులు విషజీవాంశములను తుమ్ము, దగ్గుల ద్వారా వ్యాపింపజేస్తారు. పొక్కులు పూర్తిగా మాడి పెచ్చులు కట్టేవఱకు (సుమారు నాలుగైదు దినములు) వీరు ఆటాలమ్మను వ్యాపించగలరు. సాధారణముగా ఆటాలమ్మ రెండు వారములలో తగ్గిపోతుంది. వయోజనులలో జ్వరము, విరివిగా విస్ఫోటము కలిగి వ్యాధి ఎక్కువ దినాలు

365 ::