పుట:Hello Doctor Final Book.pdf/365

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34. ఆటాలమ్మ (Chicken pox) : అగ్గి చప్పి / అగ్నిసర్పి / ఒడ్డా ణపు చప్పి / మేఖల విసర్పిణి / (Shingles / Herpes Zoster) ఆటాలమ్మ (Chicken pox, Varicella) ; అగ్గిచప్పి / అగ్నిసర్పి (Shingles / Herpes Zoster) వ్యాధులు ఆటాలమ్మ - అగ్నిసర్పి విషజీవాంశము (Varicella Zoster Virus - VZV) వలన కలుగుతాయి. VZV, హెర్పీస్ కుటుంబపు విషజీవాంశములలో (viruses) ఒకటి. హెర్పీస్ విషజీవాంశములు డి ఎన్ ఎ తరగతికి (DNA viruses) చెందినవి. ఇవి రెండు పోగుల డీ ఆక్సీరైబోన్యూక్లియక్ ఏసిడ్ జన్యు సముదాయమును కలిగి ఉంటాయి. ఆ జన్యు సముదాయము వింశతి (ఇరువది) ఫలక ఆకారములో ఉన్న మాంసకృత్త్తు పెంకులో (Icosahedral capsid) యిమిడి ఉంటుంది. ఇవి కణములకు సోకి ఆ కణములలోనికి చొచ్చుకొన్నపుడు ఆ కణముల న్యూక్లియస్ లలో విషజీవాంశ డి ఎన్ ఎ లు ఉత్పత్తయి కణద్రవములోనికి విడుదలయి ఆ విషజీవాంశములు (Viruses) సంఖ్యాపరముగా వృద్ధి చెందుతాయి. ఆటాలమ్మ (Varicella or Chickenpox) :

చాలామందికి చిన్నతనములోనే ఆటాలమ్మ సోకి ఉంటుంది. నవతరములో వారికి ఆటాలమ్మ టీకాలు వేయుటవలన సుమారు డెబ్బది శాతపు పిల్లలకు వ్యాధినిరోధక శక్తి పెరిగి ఆటాలమ్మ సోకదు. అందు వలన వ్యాధి అరుదయే అవకాశము ఉన్నది.

ఆటాలమ్మను కలిగించే వి.జి.విషజీవాంశములు (VZV) గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి. వ్యాధి గలవారు తుమ్ములు, దగ్గుల లాలాజల తుంపరులతో విషజీవాంశములను వెదజల్లుతారు. విషజీవాంశములు ఉన్న గాలిని పీల్చుటవలన గాని, లేక చర్మ విస్ఫోటపు పొక్కులను తాకుటవలన గాని వ్యాధి సోకుతుంది. అగ్గిచప్పి (మేఖల విసర్పిణి: Herpes Zoster /

364 ::