పుట:Hello Doctor Final Book.pdf/364

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తేనెటీగలకు, కందిరీగలకు, పులిచీమలకు అసహనము కలవారు, వికటత్వ లక్షణములు కలిగినవారు తేనెటీగలు, కందిరీగలు కుట్టిన వెంటనే సత్వరముగ తమకు తాము ఎపినెఫ్రిన్ ను తొడకండరములలో తీసుకొనుటకు EpiPen లు లభ్యము . నివారణ :

అసహనము కల ఆహారపదార్థములను, ఔషధములను వాడకూడదు.

తేనెటీగలు, కందిరీగలకు దూరముగా ఉండాలి. వాటికి దగ్గఱలో మసలేటప్పుడు వాటిని రెచ్చగొట్టకూడదు. వైద్యులు వేంకోమైసిన్ (vancomycin)  సిరల ద్వారా  బొట్లగా ఇచ్చేటపుడు తగిన వ్యవధిలో నెమ్మదిగా ఇవ్వాలి. అవసరమైతే డైఫెన్ హైడ్రమిన్ ను (Diphenhydramine) కూడా ముందుగా ఈయవచ్చును.

రేడియో వ్యత్యాస పదార్థములను ‘ఎక్స్- రే’ ల కొఱకు వాడునపుడు అవసరమైన వారికి ముందుగా ప్రెడ్నిసోన్ (Prednisone), డైఫెన్ హైడ్రమిన్ (Diphenhydramine) వాడాలి. వై ద్యులు, వై ద్యశాలలు ఎపినెఫ్రిన్ ను ఎల్ల వేళలా అందుబాటులో ఉంచుకొవాలి.:

రక్షణ వికటత్వము కలిగిన రోగులకు అత్యవసర చికిత్స అవసరము కాబట్టి దగ్గఱలో ఉన్న వైద్యుల ఒద్దకో దగ్గఱలో అందుబాటులో ఉన్న వైద్యశాలలకో  వెళ్ళుట మేలు. చికిత్సకై ఎపినెఫ్రిన్  వాడుటకు వైద్యులు సంశయించకూడదు. చికిత్సలో జాప్యము కూడదు. రక్షణ చికిత్స (Immunotherapy) :

వినీల ప్రతిజనకములను (allergens) తక్కువ మోతాదులలో మొదలుపెట్టి యిస్తూ, క్రమరీతిలో మోతాదులను పెంచుకొంటూ, శరీరములో అసహనమును అణచు రక్షణ చికిత్సలు (suppressive immunotherapies) లభ్యము. తేనెటీగలు, కందిరీగలు, పులిచీమల విషములకు రక్షణ చికిత్సలను విరివిగా వాడుతారు.

363 ::