పుట:Hello Doctor Final Book.pdf/363

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

my) శ్వాసనాళములోనికి కృత్రిమనాళమును శ్వాసకై అమర్చి కృత్రిమ శ్వాసలను అందించాలి. ద్రావణములు:

రక్షణ వికటత్వము కల వారికి సిరలద్వారా లవణ ద్రావణములను (normal saline) ఇవ్వాలి. రక్తపీడనము తక్కువగా ఉంటే 500 - 1000 మి.లీ లవణ ద్రావణమును (normal saline) సిరద్వారా 15-30 నిముషములలో త్వరగా యిచ్చి ఆపై అవసరమునకు తగ్గట్టు సిరలద్వారా ద్రావణములను ఇయ్యాలి. గ్ లూ కగాన్ ( Glucagon ) :

బీటా గ్రాహక అవరోధకములు (beta adrenergic receptor blockers) వాడే వారిలో రక్షణ వికటత్వ లక్షణములు తీవ్రముగా ఉండి చికిత్సకు ప్రతిఘటన ఉంటుంది. వీరు త్వరగా కోలుకోరు. వీరికి గ్లూకగాన్ (Glucagon) అవసరము. 1 మి.గ్రా. సిర ద్వారా యిచ్చి ఆపై సిర ద్వారా గంటకు 1 మి. గ్రా ను బొట్లధారగా  ఇవ్వాలి. గ్ లూ కోకార్టికాయిడ్స్ (Glucocorticoids) :

రక్షణవికటత్వము గల వారిలో గ్లూకోకార్టికాయిడ్స్ వలన తక్షణ ప్రయోజనము చాలా తక్కువ. దశల వారిగా వికటత్వము తిరుగబడకుండా ఉండుటకు మిథైల్ ప్రెడ్నిసలోన్  (methylprednisolone ) దినమునకు శరీరపు  ప్రతి కిలోగ్రాము బరువునకు  1-2 మి.గ్రా. చొప్పున ఒకటి, రెండు దినములు వాడవచ్చును. హిష్ట మిన్ గ్రాహక అవరోధకములు ( Antihistamines ) :

దురద, దద్దుర్లు, చర్మ విస్ఫోటము గల వారిలో  డైఫెన్ హైడ్రమిన్ (diphenhydramine  (Benadryl) 25 మి.గ్రా - 50 మి.గ్రా లు కండరముల ద్వారా కాని, సిర ద్వారా కాని ఈయవచ్చును. వీటి వలన  వికటత్వ లక్షణములు వెంటనే ఉపశమించవు. వీరిలో హిష్టమిన్ -2 గ్రాహక అవరోధకములను కూడా వాడవచ్చును.

362 ::