పుట:Hello Doctor Final Book.pdf/362

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పిల్లలలో ఎపినెఫ్రిన్ ను 0.01 మి.గ్రా / 1 కిలో శరీరపు బరువు చొప్పున మొత్తము 0.1 మి.గ్రా నుంచి 0.3 మి.గ్రా వఱకు ఇవ్వాలి (1 : 1000 ద్రావణములో 0.1 - 0.3 మి.లీ )

రక్తపీడనము తక్కువగా ఉన్నవారిలోను, శ్వాస శ్రమ అధికముగా ఉన్నవారిలోను ఎపినెఫ్రిన్ ను నాలుక క్రింద (sublingual) కూడా ఈయవచ్చును. కేంద్ర సిరల ద్నారా (అంతర కంఠసిర/Internal jugular vein, లేక అధోజత్రుసిర/Subclavian vein లేక ఊరుసిర/ Femoral vein) ద్వారా కూడా ఎపినెఫ్రిన్  3 - 5 మి.లీ 1: 10,000  ద్రావణమును ఈయవచ్చును. శ్వాస నాళములో శ్వాసకై (శ్వాసనాళాంతర) కృత్రిమ నాళము (endotracheal tube) అమర్చితే, ఆ నాళము ద్వారా కూడా ఎపినెఫ్రిన్  3-5 మి.లీ  1 : 10,000 ద్రావణమును 10 మి.లీ లవణ ద్రావణములో వినీలపఱచి ఈయవచ్చును.

వ్యాధిగ్రస్థుల శ్వాసక్రియను పరిశీలించాలి. 100 % ప్రాణవాయువు అందఱికీ అందించాలి. శ్వాసనాళికలలో మృదుకండరముల బిగుతు ఎక్కువయితే బీటా ఎడ్రినెర్జిక్ గ్రాహక ఉత్తేజకములను (beta adrenergic receptor agonists) శ్వాస ద్వారా ఇయ్యాలి.

నాలుక, కొండనాలుక, గొంతుకలలో పొంగు ఉన్నా, స్వరపేటికలో పొంగు ఉన్నా, స్వరపేటికలో కండరములు బిగించుకుపోయినా (laryngeal spasm),  శ్వాస వైఫల్యము ఉన్నా, శ్వాసనాళములోనికి నోటిద్వారా  కాని ముక్కుద్వారా కాని  కృత్రిమ (శ్వాసనాళాంతర) నాళమును (endotracheal tube) చొప్పించి కృత్రిమశ్వాసలు అందించాలి. కృత్రిమ శ్వాసనాళమును చొప్పించుట సాధ్యము కాని వారిలో స్వరపేటిక క్రింద ఉన్న  క్రైకో-థైరాయిడ్ పొరలో రంధ్రము చేసికాని (crico thyroidotomy), శ్వాసనాళములో రంధ్రము చేసికాని (Tracheosto:: 361 ::