పుట:Hello Doctor Final Book.pdf/361

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వినీలపఱచి  అనుమానము ఉన్న పదార్థములను సూదిమందుగా ఇచ్చి అసహనములను గుర్తించవచ్చును. ఈ పరీక్షలు నిర్వహించునపుడు జాగ్రత్త అవసరము. వికటత్వ లక్షణములు పొడచూపితే తక్షణ చికిత్స అవసరము. చికిత్స :

రక్షణ వికటత్వమును (Anaphylaxis) రోగ సమాచారము, లక్షణములబట్టి  త్వరగా గుర్తించి చికిత్సను సత్వరముగా అందించాలి.

రక్షణ వికటత్వమునకు చికిత్స ఎపినెఫ్రిన్ (Epinephrine). ఎపినెఫ్రిన్ ను ఎడ్రినలిన్ అని కూడా వ్యవహరిస్తారు. దీనిని తొడ వెలుపలి భాగపు కండరములలో సూదిమందుగా (intramuscular injection) ఇయ్యాలి. (తొడ వెలుపలి భాగములో ముఖ్యమైన రక్తనాళములు, నాడులు ఉండవు.) వయోజనులలో  0.3 మి.గ్రా నుంచి 0.5 మి.గ్రా. వఱకు (1 : 1000 ద్రావణములో 0.3 - 0.5 మి.లీ) సూదిమందుగా ఇవ్వవచ్చును. రక్తపీడనము తక్కువగా ఉన్నవారిలోను, శ్వాస యిబ్బంది కొనసాగేవారిలోను ప్రతి 10- 15 నిముషములకు ఈ మోతాదును మఱల మఱల కొనసాగించాలి.

360 ::