పుట:Hello Doctor Final Book.pdf/360

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ను పోలిన పదార్థములు ఉండుట వలన ముఖము, శరీరము ఎఱ్ఱబడి రక్షణ వికటత్వమును పోలవచ్చును.

వేంకోమైసిన్ (vancomycin)  అనే ఔషధమును  సిరలద్వారా బొట్లధారగా త్వరగా  ఇచ్చునపుడు ముఖము, దేహము ఎఱ్ఱబడి, దురదను, మంటను కలిగించవచ్చును. దీనిని Redman syndrome గా వర్ణిస్తారు. అది అసహనము (allergy) కాదు. హిష్టమిన్ అవరోధకములను ( antihistamines ) ముందు ఇచ్చి, వేంకోమైసిన్ (vancomycin ) బొట్లధారను నెమ్మదిగా ఇచ్చుటచే  ఈ ఎఱ్ఱమనిషి ఉపద్రవమును అరికట్టవచ్చును. కార్సినాయిడ్ సిండ్రోమ్ (carcinoid syndrome) అనే వ్యాధిలోను, ఫియోఖ్రోమోసైటోమా (pheochromocytoma) వ్యాధిలోను కూడా పరంపరలుగా ముఖము, దేహము ఎఱ్ఱబడుతాయి. మద్యము తాగినవారిలోను ఎఱ్ఱదనము కనిపించవచ్చును. హృద్రోగముల వలన, రక్తస్రావము వలన, సూక్ష్మజీవ విషమయ వ్యాధుల (sepsis) వలన రక్తపీడనము తగ్గి ఆయాసము, ముచ్చెమటలు కలుగవచ్చును. ఆఘాతమునకు (shock) సరియైన కారణమును నిర్ణయించాలి. వ్యాధి నిర్ణయము :

రక్షణ వికటత్వమును సత్వరముగ రోగ లక్షణములతో ధ్రువపఱచి వెనువెంటనే చికిత్స చేయాలి. రక్తపరీక్షలైనా , ఇతర పరీక్షలయినా ఇతర వ్యాధులను కనుగొనుటకు అసహనతలకు కారణాలు తెలుసుకొనుటకు మాత్రమే ఉపయోగపడుతాయి. రక్తములో సంబంధించిన ఐజి-ఇ (IgE ) ప్రతిరక్షకములను  (antibodies) కనిపెట్టి వాటి విలువలతో అసహనములను నిర్ణయించవచ్చును.

రక్తములో ట్రిప్టేజ్ (tryptase) ప్రమాణములను కనుగొనవచ్చును. రక్షణ వికటత్వము కలిగిన ఒక గంటలో ట్రిప్టేజ్ విలువలు పెరుగుతాయి. ఆరు గంటల పిదప ఈ విలువలు క్రమముగా తగ్గుతాయి. చర్మపు పైపొరలో (intradermal) చాలా తక్కువ మోతాదులలో,

359 ::