పుట:Hello Doctor Final Book.pdf/359

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కడుపులలో పీకు, నొప్పి, వమన భావన ( వాంతి కలిగేటట్లు అనిపించుట nausea ), వాంతులు, విరేచనములు కలుగ వచ్చును.

రక్తప్రసరణ వైఫల్యము, శ్వాసవైఫల్యము మృత్యువునకు దారితీయవచ్చును. అందువలన రక్షణ వికటత్వమును (anaphylaxis) అత్యవసర పరిస్థితిగా ఎంచి తక్షణ చికిత్స అందించవలసి ఉంటుంది. వైద్యులు రోగినుంచి రోగ సమాచారమును త్వరగా తీసుకొంటూ, సత్వర పరీక్ష చేస్తూనే, చికిత్స కూడా వెంటనే ప్రారంభించాలి. కాలయాపన తగదు. రోగి సమాచారములో, ఏ మందులు, ఏ ఆహారములు, లేక, ఏ ఇతర కారణముల వలన వికటత్వము కలిగినదో తెలుసుకోవాలి. వాటి బారినపడిన ఎంత సమయములో వ్యాధి లక్షణములు కలిగాయో, ఏ లక్షణములు పొడచూపాయో తెలుసుకోవాలి.

జీవ లక్షణములు (vital signs ): ధమని వేగము ( pulse rate), రక్తపీడనము ( blood pressure), శ్వాసవేగము (respiratory rate) ధమనీ ప్రాణవాయు సంపృక్తత (pulse Oxygen saturation) లను నిర్ణయించాలి. నోటిని, అంగుటిని, నాలుకను పొంగులకు, శ్వాస అవరోధమునకు పరీక్షించాలి. స్వరపేటికలో పొంగు ( laryngeal edema ), స్వరపేటిక బిగుతులకు (laryngeal spasm), ఊపిరితిత్తులను పరీక్షించి, శ్వాసనాళికల బిగుతును, శ్వాస స్థితిని తెలుసుకోవాలి. హృదయ పరీక్ష, ఉదర పరీక్షలు కూడా త్వరగా నిర్వర్తించాలి. చర్మమును దద్దుర్లకు, విస్ఫోటమునకు (rash), ఎఱ్ఱదనమునకు, పొంగులకు  పరీక్షించాలి.

రక్షణ వికటత్వ లక్షణముల తీవ్రత తక్కువగాను, మధ్యస్థముగాను, ఎక్కువగాను ఉండవచ్చును. రక్షణ వికటత్వమును పోలు ఇతర వ్యాధులు :

ఆహార పదార్థములలో సల్ఫైటుల వలన, పాడయిన చేపలలో హిష్టమిన్

358 ::