పుట:Hello Doctor Final Book.pdf/358

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంకోచములు దేహమంతటా కలిగి వికటత్వ లక్షణములను కలుగజేస్తాయి.

రక్షణవ్యవస్థ ప్రమేయము లేకుండా వికటత్వము కలిగించు పదారము ్థ లు ప్రత్యక్షముగా క్షారాకరణ ్ష కణములు  (basophils), స్తంభకణములు (mast cells) నుంచి కణిక రూపములో (granules) ఉన్న రసాయనములను విడుదల చేసి వికటత్వ లక్షణములను కలిగిస్తాయి. రక్షణ వికటత్వ లక్షణములు :

అసహనము ఉండుటచే రక్షణ వికటత్వము ప్రతిరక్షకము -ఇ (immunoglobulin E) ద్వారా కలిగినా, అసహనము లేకుండా కలిగినా వికటత్వ లక్షణములలో తేడా ఉండదు. వ్యాధి లక్షణములు ప్రతిజనకముల (antigens) బారిపడిన  కొద్ది నిముషములలో కాని కొద్ది గంటలలో కాని పొడచూపవచ్చును. కొందఱిలో వ్యాధి లక్షణములు రెండు దశలలో కలుగవచ్చును. కొద్ది మందిలో లక్షణముల నుంచి చాలా గంటల వఱకు ఉపశమనము కలుగక పోవచ్చును. అందువలన వ్యాధిగ్రస్థులను చాలా గంటలు పర్యవేక్షించాలి. దుఱద, దద్దుర్లు (urticaria), చర్మము ఎఱుపెక్కుట, రక్తనాళములు స్రవించి పొంగులు (angioedema), కలుగుతాయి. స్వరపేటికలో పొంగు (laryngeal edema), స్వరపేటిక కండర దుస్సంకోచము (laryngeal spasm), శ్వాసనాళికల దుస్సంకోచముల (bronchospasm) వలన ఆయాసము, శ్వాసకు ఇబ్బంది, శ్వాస వైఫల్యము ( Respiratory failure ) కలుగవచ్చును. రక్తనాళములలో బిగుతు తగ్గుట వలనను, రక్తనాళములు స్రవించుటచే రక్తనాళములలో రక్తపరిమాణము తగ్గుట వలనను  రక్తపీడనము తగ్గి వివిధ అవయవములకు రక్తప్రసరణ తగ్గవచ్చును. రక్తపీడనము బాగా తగ్గి అవయవములకు  రక్తప్రసరణ తగ్గుటను వైద్యులు ఆఘాతముగా (Shock) వర్ణిస్తారు.

మృదుకండరముల సంకోచము, బిగుతుల వలన కడుపు, పొత్తి

357 ::