పుట:Hello Doctor Final Book.pdf/357

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వ్యాధులు, మూత్రాంగ వ్యాధులు కలవారిలోను, యిదివఱలో వికటత్వ లక్షణములు కలిగినవారిలోను, అసహనములు (allergies) కలవారిలోను ఈ వికటత్వము కలిగే అవకాశములు హెచ్చు. అయొడిన్ అసహనము వలనకాని, జలచరములకు అసహనము కలిగినవారిలో కాని రేడియో వ్యత్యాస పదార్థములకు (Radio contrast materials) అసహనము కలుగదు.

స్తంభకణ వ్యాధి (mastocytosis) కలవారిలో స్తంభకణములు అత్యధిక సంఖ్యలో ఉత్పత్తి అవుతాయి. ఈ వ్యాధికలవారిలో రక్షణ వికటత్వములు కలిగే అవకాశములు హెచ్చు. వ్యాధి విధానము (Pathophysiology) :

ప్రతిజనకములు (antigens) శరీరములోనికి ప్రవేశించినపుడు రక్షకకణములు ప్రేరేపించబడి ఆ ప్రతిజనకములను ఎదుర్కొనే ప్రతిరక్షకములను (antibodies) ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్రతిరక్షకములలో ప్రతిరక్షకము ఇ (Immunoglobulin E, IgE) అసహన ప్రక్రియను (allergy), వికటత్వ ప్రక్రియను (anaphylaxis) కలిగించుటలో పాల్గొంటుంది. ఈ ప్రతిరక్షకము - ఇ  (IgE) క్షారాకర్షణ కణములకు (Basophils), సంధాన కణజాలములో  (connective tissue) ఉండు స్తంభకణములకు (mast cells) అంటుకొని ఉంటుంది. ప్రతిజనకములు  (antigens) మరల శరీరములోనికి చొచ్చుకున్నపుడు అవి ప్రతిరక్షకము - ఇ (IgE) కి సంధానమయి  క్షారాకర్షణ కణముల (basophils) పైన, స్తంభకణముల (mast cells) పైన ఉండు fc గ్రాహకములకు (fragment crystallizable receptors) చేర్చబడుతాయి. అపుడు ఆ కణములు ప్రేరేపించబడి వాటిలో కణికల (granules) రూపములో ఉన్న హిష్టమిన్ (histamine), సీరోటోనిన్ (Serotonin), హెపరిన్ (heparin) వంటి  రసాయనములను విడుదల చేస్తాయి. ఈ రసాయనముల వలన సూక్ష్మరక్తనాళికలు స్రవించుట (capillary leakage), కణజాలములో పొంగు, మృదు కండరముల

356 ::