పుట:Hello Doctor Final Book.pdf/356

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చేయాలి. రక్షణ వికటత్వము వలన ప్రాణాపాయము కూడా వాటిల్ల వచ్చును. కారణములు : రక్షణవ్యవస్థ ద్వారా కలిగే వికటత్వము (Anaphylaxis mediated by Immune system) :

    ఆహార పదార్థములు ; వేరుశనగ పిక్కలు, ఇతర పిక్కలు, కాయలు, పలుకులు, పాలు, గ్రుడ్లు, చేపల వలన, తేనెటీగలు (bees), కందిరీగలు (wasps), పులిచీమలు (fire ants) కుట్టడము వలన, ఔషధముల (medicines) వలన, రబ్బరు, రబ్బరుపాలు (latex) వలన, రక్తము, రక్తాంశముల వలన రక్షణవ్యవస్థ ఉత్పత్తి చేయు ప్రతిరక్షకములు (immunoglobulins) కలిగించే రక్షణ వికటత్వము కలుగ వచ్చును. సాధారణముగ  ప్రతిరక్షకము -ఇ (Immunoglobulin- E, IgE) వలన ఈ వికటత్వము కలుగుతుంది. అసాధారణముగా ప్రతిరక్షకము - g (immunoglobulin- G, IgG) వలన వికటత్వము కలుగవచ్చును. ఉబ్బస వ్యాధి గలవారిలోను, ఇదివరలో ప్రతిజనకముల (antigens) బారిపడి ఐజి-ఇ  IgE ఉత్పత్తిచే అసహనము, వికటత్వము పొందిన వారిలోను ఈ వికటత్వము కలిగే అవకాశములు హెచ్చు. రక్షణవ్యవస్థ ప్రమేయము లేక కలిగే రక్షణ వికటత్వములు : (Anaphylaxis not mediated by immune system) :

ఎక్స్ రే వ్యత్యాస పదార్థములు (Radio contrast materials), కొన్ని ఔషధములు (తాప అవరోధకములు (non steroidal antiinflammatory agents), నల్లమందు సంబంధిత మందులు (opioids), ఏస్ ఇన్హిబిటర్లు (ACE inhibitors), వేంకోమైసిన్ (vancomycin), కండర విశ్రామకములు (muscle relaxants), భౌతిక కారణములు (శీతలము, వ్యాయామము), రక్తశుద్ధి చికిత్సలు (Hemodialysis) రక్షణ వికటత్వమును కలిగించ వచ్చును. ఏబది సంవత్సరముల వయస్సు దాటిన వారిలోను, హృదయ

355 ::